యూకే అరుదైన పురస్కారం పొందిన భారత సంతతి వైద్యుడు

By narsimha lodeFirst Published Aug 18, 2020, 11:52 AM IST
Highlights

భారత సంతతికి చెందిన వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్ లో అరుదైన పురస్కారం దక్కింది.  యూకేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్స్ స్పెషల్ అవార్డును రవికి అందించింది.


లండన్: భారత సంతతికి చెందిన వైద్యుడు రవి సోలంకికి బ్రిటన్ లో అరుదైన పురస్కారం దక్కింది.  యూకేకు చెందిన రాయల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్స్ స్పెషల్ అవార్డును రవికి అందించింది.

నాడీ సంబంధిత వ్యాధుల నిపుణుడుగా రవి సోలంకి పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో  కరోనా సోకిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకుగాను ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్ ను తయారు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు రవి సోలంకి.

నేషనల్ హెల్త్ సర్వీస్ ఛారిటీ హీరోస్ కోసం సురక్షితంగా పనిచేసే వెబ్ సైట్ తయారీతో పాటు పలువురికి స్వచ్ఛంధంగా సేవలు అందించినందుకు ఆయనకు ఈ అవార్డు దక్కింది.

అతి తక్కువ సమయంలోనే ఈ వెబ్ సైట్ ను తయారు చేసి పిల్లల సంరక్షణ, కరోనా సేవలో ఉన్న వారికి పీపీఈ పరికరాలు అందించారు.ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజల నుండి సందేహాలు, సలహాలు స్వీకరించడంతో పాటు విరాళాలను స్వీకరించడానికి కూడ అనుమతించాయి. 

ఈ వెబ్ సైట్ ద్వారా మూడు నెలల్లో 90  వేల మంది ఎన్ హెచ్ ఎసం కార్మికులకు మద్దతుగా నిలిచింది. డిజిటల్ ఫ్లాట్ పామ్ ను విస్తరించడానికి ఆరోగ్య సంరక్షణ కార్మికులకు అందించే సహాయాన్ని విస్తరించడానికి బృందం  చేస్తోన్న కృషి కొనసాగుతోందని ఆ సంస్థ ప్రకటించింది.

click me!