భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి: మూడోసారి అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నిక

By narsimha lodeFirst Published Nov 4, 2020, 10:59 AM IST
Highlights

భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వరుసగా అమెరికా ప్రతినిధుల సభకు మూడోసారి ఎన్నికయ్యారు.

న్యూఢిల్లీలో జన్మించిన 47 ఏళ్ల కృష్ణమూర్తి... తన ప్రత్యర్ధి నీల్సన్ ను సులభంగా ఓడించాడు. లిబర్టేయన్ పార్టీకి చెందిన నీల్సన్ పై ఆయన విజయం సాధించడం నల్లేరుపై నడకగా మారిందని నివేదికలు చెబుతున్నాయి. కృష్ణమూర్తికి 71 శాతం ఓట్లు దక్కాయి.

కృష్ణమూర్తి  తల్లిదండ్రులు తమిళనాడుకు చెందినవారు. 2016లో ఆయన తొలిసారిగా అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.అమీబేరా కాలిఫోర్నియా నుండి వరుసగా ఐదోసారి ఎన్నికయ్యారు. రో ఖన్నా కాలిఫోర్నియా నుండి మూడుసార్లు ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు.

వాషింగ్టన్ రాష్ట్రం నుండి ప్రమిలీ జయపాల్ వరుసగా ప్రతినిధుల సభకు అడుగుపెట్టారు.కాలిఫోర్నియా, వాషింగ్టన్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తొలి గంటల్లోనే ప్రకటించనున్నారు.

డాక్టర్ హిరాల్ టిపిర్నేని అరిజోనా నుండి వరుసగా మూడో ప్రయత్నం చేస్తున్నారు.రిపబ్లికన్ మాంగా అనంతత్ములా 11వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ ఆఫ్ వర్జీనియా నుండి డెమోక్రటిక్ పదవిలో ఉన్న జెర్రీ కొన్నోల్లిపై దాదాపు 15 శాతం పాయింట్లతో వెనుకబడి ఉన్నారు.


 

click me!