జాతీయ రహదారిపై బాంబు పేలుడు.. 34మంది దుర్మరణం

Published : Jul 31, 2019, 11:22 AM IST
జాతీయ రహదారిపై బాంబు పేలుడు..  34మంది దుర్మరణం

సారాంశం

హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో సుమారు 34మంది దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారులు,మహిళలు ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. 

ఆప్ఘనిస్తాన్ లో మరోసారి మారణ హోమం సృష్టించారు. ఉగ్రవాదులు రెచ్చిపోయి బాంబు దాడులకు పాల్పడ్డారు. హరాత్-కాందహార్ జాతీయ రహదారిపై బాంబులతో విరుచుకుపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో సుమారు 34మంది దుర్మరణం చెందారు. మృతుల్లో చిన్నారులు,మహిళలు ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఈ ఘటనలో పదుల సంఖ్యలో స్థానికులు గాయాలపాలయ్యారు. కాగా.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.  మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా... ఆప్ఘాన్ ప్రభుత్వం, దాని మిత్ర దేశాలకు తాలిబన్లతో యుద్ధం జరుగుతోంది. దీని కారణంగా గత కొన్ని రోజులుగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో మంగళవారం తాలిబన్లు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా... 23మంది గాయపడ్డారు. తాజాగా బుధవారం మరో మారణ హోమానికి పాల్పడ్డారు. 
 

PREV
click me!

Recommended Stories

స్నేక్ ఫామ్ నుంచి కొట్టుకొచ్చిన 900 విష పాములు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు. భయంకరమైన‌ వీడియో
Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?