రైళ్లలో ప్రయాణించండి.. టికెట్లు కొనక్కర్లేదు: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్ధులకు ఇండియన్ ఎంబసీ సూచనలు

Siva Kodati |  
Published : Feb 27, 2022, 05:25 PM IST
రైళ్లలో ప్రయాణించండి.. టికెట్లు కొనక్కర్లేదు: ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్ధులకు ఇండియన్ ఎంబసీ సూచనలు

సారాంశం

ఉక్రెయిన్‌పై రష్యా దాడి (ukraine russia crisis) నేపథ్యంలో భారతీయ విద్యార్ధులను (indian students evacuation) తరలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విద్యార్ధులు ఆ దేశ రైలు సేవలు వినియోగించుకోవాలని సూచించింది. ఈ ప్రయాణానికి గాను ఎలాంటి టికెట్లు అవసరం లేదని.. అందరూ కూడా దేశ పశ్చిమ ప్రాంతంవైపు ప్రయాణించాలని సరిహద్దు దాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. 

ఉక్రెయిన్‌పై రష్యా దాడి (ukraine russia crisis) నేపథ్యంలో భారతీయ విద్యార్ధులను (indian students evacuation) తరలించేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్ధులకు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక (indian students evacuation0 సూచనలు చేసింది. విద్యార్ధులు ఆ దేశ రైలు సేవలు వినియోగించుకోవాలని సూచించింది. ఈ ప్రయాణానికి గాను ఎలాంటి టికెట్లు అవసరం లేదని.. అందరూ కూడా దేశ పశ్చిమ ప్రాంతంవైపు ప్రయాణించాలని సరిహద్దు దాటేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించింది. 

కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం నేపథ్యంలో వేలాది మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనే చిక్కుకుపోయారు. యుద్దం కారణంగా ఉక్రెయిన్ గగనతలం పూర్తిగా మూసివేయబడింది. ఈ క్రమంలోనే అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా భారతీయులను రోడ్డు మార్గంలో సరిహద్దుల్లో దేశాలకు తరలిస్తుంది. ఇప్పటికే రొమేనియా, హంగేరి దేశాలకు భారతీయులను తరలించి.. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తీసుకువస్తుంది.

ఉక్రెయిన్ సరిహద్దుల్లోని ఇతర దేశాలతో కూడా భారత విదేశాంగ శాఖ (ministry of external affairs0 చర్చలు జరుపుతుంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సరిహద్దు దేశాల్లోకి ప్రవేశించడానికి అనుమతిస్తే వారిని ఇండియాకు తరలించడం సులువు అవుతంది. అయితే భారతీయుల తరలింపు ప్రక్రియకు సంబంధించి పోలాండ్ నుంచి శుభవార్త అందించింది. ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ నుంచి తప్పించుకున్న భారతీయ విద్యార్థులందరినీ ఎలాంటి వీసా లేకుండానే పోలాండ్‌లోకి అనుమతించనున్నట్టుగా భారత్‌లోని ఆ దేశ రాయబారి Adam Burakowski తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు.  

ఇక, పోలాండ్‌లో (poland) ఇండియన్ ఎంబసీ ఇటీవల విడుదల చేసిన అడ్వైజరీలో.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయలును తరలింపు ప్రక్రియకు సూచనలు చేసింది. పశ్చిమ ఉక్రెయిన్‌లోని భారతీయ పౌరులను పోలాండ్ ద్వారా భారతదేశానికి తరలించాలని చూస్తున్నట్టుగా తెలిపింది. తరలింపు కోసం ఏర్పాటు చేయబడిన రాయబార కార్యాలయాల కో-ఆర్డినేట్‌లను గమనించాలని కోరింది. అందుకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కూడా జత చేసింది.గూగుల్ ఫామ్‌లో వివరాలు రిజిస్టర్ చేయాలని పేర్కొంది. 

ఇక, పోలాండ్ ప్రభుత్వం Shehyni-Medyka సరిహద్దు పాయింట్ ద్వారా కాలినడకన మాత్రమే జనాలు సరిహద్దు దాటడానికి అనుమతిస్తోంది. Krakowiec crossing వద్ద వారి వాహనాల్లో ప్రయాణించే వ్యక్తులకు మాత్రమే అనుమతిస్తోంది. ఇక, ఇప్పటికే కొందరు భారతీయులు పోలాండ్‌ సరిహద్దులకు చేరుకన్న సంగతి తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

World Smallest Railway : ఈ దేశ రైల్వే నెట్ వర్క్ కేవలం 862 మీటర్లు మాత్రమే..!
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే