ఉక్రెయిన్ లో తెలుగు డాక్టర్...తన పెంపుడు జంతువుల మీద ప్రేమతో...

By telugu news team  |  First Published Mar 9, 2022, 7:44 AM IST

 యాగ్వార్ అనే జాగ్వర్, సబ్రినా అనే నల్ల చిరుతపులిని అతను పెంచుకుంటున్నాడు. తాను స్వదేశానికి వస్తే.. వీటిని కూడా అనుమతించాలని అతను కోరడం గమనార్హం.
 


ఉక్రెయిన్ లో రష్యా భీకర యుద్ధం ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. ఈ యుద్ధం కారణంగా ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కూడా కోల్పోయాడు. దీంతో.. ఇంకెవరూ ఆ పరిస్థితి ఎదుర్కొనకూడదనే ఉద్దేశంతో.. భారతీయ విద్యార్థులందరినీ అక్కడి నుంచి స్వదేశానికి సురక్షితంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో.. ఓ భారతీయ వైద్యుడు మాత్రం అక్కడి నుంచి స్వదేశానికి రావడానికి అంగీకరించకపోవడం గమనార్హం. అలా రాకపోవడానికి ఆయనకో సమస్య ఉంది. అయితే.. ఆయన విచిత్ర మైన సమస్య విని అందరూ షాకౌతున్నారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... . సోషల్ మీడియాలో జాగ్వార్ కుమార్ అని పిలవబడే కీళ్ళ వైద్యుడు కుమార్, తన పెంపుడు జంతువులతో ఆగ్నేయ ఉక్రెయిన్‌లోని డోన్‌బాస్ సమీపంలో తన ఇంటి కింద ఉన్న బంకర్‌లో ఉంటున్నాడు.

Latest Videos

undefined

 యాగ్వార్ అనే జాగ్వర్, సబ్రినా అనే నల్ల చిరుతపులిని అతను పెంచుకుంటున్నాడు. తాను స్వదేశానికి వస్తే.. వీటిని కూడా అనుమతించాలని అతను కోరడం గమనార్హం.

స్వదేశానికి తిరిగొచ్చే క్రమంలో.. తనతో పాటు తన పెంపుడు జంతువులను కూడా అనుమతించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని ఇండియన్‌ ఎంబసీ తిరస్కరించింది. దీంతో ఆయన.. అవి లేకుండా తాను తిరిగి రాలేనని, ఎలాగైనా వాటిని కూడా తనతో అనుమతించాలని వేడుకుంటున్నారు. 

ఆయన 20 నెలల వయసున్న జాగ్వార్‌, 6 నెలల వయసున్న చిరుత. ఈ రెండింటినీ ఆయన కీవ్‌ జూ నుంచి తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తనుంటున్న ప్రాంతాన్ని రష్యా దళాలు చుట్టుముట్టాయని, తనను తన ‘బిడ్డల’తో పాటు కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా, 

 MBBS డిగ్రీ పూర్తి చేసి ఉక్రెయిన్‌లో స్థిరపడిన కుమార్, 84,000 మందికి పైగా ఉన్న తన యూట్యూబ్ ఛానెల్ 'జాగ్వార్ కుమార్ తెలుగు'లో, రెండు పెద్ద పిల్లులను జాగ్రత్తగా చూసుకుంటూ, వాటికి ఆహారాన్ని సేకరించేటప్పుడు తన కష్టాలను క్రమం తప్పకుండా వీడియోలు చేస్తూ ఉండటం గమనార్హం.

కుమార్ ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందినవాడు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు ఇటీవల నిర్వహించిన మీడియా ఇంటర్వ్యూలలో, కుమార్ చిన్నతనం నుండి జంతువుల పట్ల తనకున్న ప్రేమ గురించి , చిన్నతనంలో చిరంజీవి సినిమా చూసిన తర్వాత పెద్ద పిల్లులను పెంపుడు జంతువులుగా పెంచుకోవాలనే కోరిక గురించి చెప్పాడు.

 “నేను చిన్నప్పటి నుండి అమితమైన జంతు ప్రేమికుడిని. లంకేశ్వరుడు సినిమా చూసినప్పుడు చిరంజీవి పులితో చేసిన నటనకు ఫిదా అయ్యాను. చిరంజీవి మరియు పులి ఇద్దరి కోసం నేను చాలాసార్లు సినిమా చూశాను, ”అని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

click me!