కూతుళ్లకు టీ నేర్పుతున్న.. ఇండో-అమెరికన్ న్యూరోసర్జన్.. వీడియో వైరల్..!

By Ramya news teamFirst Published Dec 15, 2021, 10:33 AM IST
Highlights

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు మూడు నిమిషాల విడిది ఉన్న  ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

భారతదేశంలో టీ తాగడం, టీ చేయడం పెద్ద విషయం కాదు. ప్రతిరోజూ దేశంలోని దాదాపు అందరూ టీని ఆస్వాదిస్తారు. ఉదయాన్నే.. బెడ్ దిగగానే.. టీ తాగడానికి ఇష్టపడతారు. కనీసం టీ తాగకుండా రోజు గడపడాన్ని కూడా ఊహించలేరు. అయితే.. మనకు ఇష్టమైన ఈ పానీయాన్ని.. ఇతర దేశీయులు.. ఇష్టంగా తాగడం.. దానిని తయారు చేయాలని అనుకుంటున్నారు అనే విషయం మనకు తెలిస్తే.. మామూలుగానే కాస్త ఎక్కువగా సంతోషిస్తాం.

కాగా.. తాజాగా భారత సంతతికి చెందిన అమెరికన్ న్యూరో సరన్ డాక్టర్ సంజయ్ గుప్తా..CNN చీఫ్ మెడికల్ కరస్పాండెంట్ అయిన ప్రముఖ టీవీ వ్యక్తి, తన కుమార్తెలకు టీ ఎలా తయారు చేయాలో నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు మూడు నిమిషాల విడిది ఉన్న  ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

Continuing family tradition, Dr. Sanjay Gupta teaches his daughters the chai recipe he learned from his mother. https://t.co/wVDFVQ6l67 pic.twitter.com/M4gxsjGxqu

— CNN (@CNN)

 

టీ తయారు చేయడానికి ఉపయోగించి పాత్ర, కప్పులు.. తన తల్లి నుంచి వచ్చినవని డాక్టర్ సంజయ్ చెప్పడం గమనార్హం.  టీ పొడికి పదులుగా ఆయన.. టీ బ్యాగులను ఉపయోగించారు. ఆయన.. ఆ టీని ఎలా తయారు చేయాలో.. తన కుమార్తెలకు నేర్పిస్తుండటం గమనార్హం.  అయితే.. ఆ టీ మన  భారత్ లో టీ లాగా మాత్రం కనిపించడం లేదు. ఆయన తయారు చేసిన టీని... ఆయన కుమార్తెలకు టీ కప్పుల్లో పోస్తుండటం గమనార్హం.  కావాలంటే.. ఆ వీడియోని కింద ఓసారి చూడొచ్చు. 

Also Read: Tsunami Warning: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

click me!