భారత్ సర్జికల్ స్ట్రైక్స్.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్

By ramya NFirst Published Feb 26, 2019, 12:02 PM IST
Highlights

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడుతోంది. 

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్ కి పాల్పడుతోంది. భారత్ చేస్తున్న  ఊహించని  మెరుపుదాడులకు పాక్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే.. వాటిని బయటకు ప్రదర్శించకుండా ఉండేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి షాకింగ్ కామెంట్స్ చేశారు.

దాడులతో పాక్ ను సవాలు చేయడం భారత్ కి మంచిది కాదని హితవు పలికారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల పాక్ ఏమీ బెదిరిపోలేదన్నారు. దురదృష్టవశాత్తూ భారత్ మరిన్ని విపత్కర పరిణామాలకు పాల్పడితే.. వాటిని ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు.

అన్నింటినీ దేవుడు చూసుకుంటాడన్నారు. శాంతిని కోరుకునే దేశం తమదని పేర్కొన్నారు. తాము ఉగ్రవాదంపై విజయవంతంగా పోరాటం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు. 

click me!