Russia Ukraine Crisis: ఇరు దేశాల సంబంధాలు బాగున్నాయి.. యుద్ద‌వేళ భార‌త్ పై ఫ్రాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Published : Mar 04, 2022, 03:11 AM IST
Russia Ukraine Crisis: ఇరు దేశాల సంబంధాలు బాగున్నాయి.. యుద్ద‌వేళ భార‌త్ పై ఫ్రాన్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

సారాంశం

Russia Ukraine Crisis: ఉక్రెయిన్ నగరాలను చేజిక్కించుకునేందుకు రష్యన్ సేనలు దాడుల్లో తీవ్రత పెంచిన నేపథ్యంలో భారత్‌‌పై ఫ్రాన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని... రష్యాను యుద్ధం విరమింప చేసేలా ఒప్పించాలని భారత్‌ను ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్  కోరారు.  

Russia Ukraine Crisis: రష్యా- ఉక్రెయిన్ మ‌ధ్య భీక‌ర యుద్దం జ‌రుగుతున్న వేళ‌.. భారత్‌‌పై ఫ్రాన్స్ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్, రష్యా మధ్య సంబంధాలు బాగున్నాయని... రష్యాను యుద్ధం విరమింప చేసేలా ఒప్పించాలని భారత్‌ను ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్  కోరారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ‌మని, ఆ దేశం చాలా శక్తిమంతమైన దేశమని, ఆ దేశానికి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనన్నారు. 

అంతర్జాతీయ వేదికలపై భారతదేశం.. మరింత బాధ్యతయుతంగా ఉండాల‌ని కోరుకుంటోంద‌నీ,. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం హోదా ఉండాల‌ని, ఇందుకు త‌మ దేశం పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నీ అన్నారు.  భార‌త దేశాన్ని విశ్వసిస్తున్నామనీ. భారతదేశం ప్రాదేశిక సమగ్రతను గౌరవించే ప్రకటనలను చాలా స్వాగతించదగినదని ఫ్రెంచ్ రాయబారి అన్నారు. భారత్ ఏమి చేయాలో? ఎవరూ చెప్పకూడదు. సంక్షోభం తీవ్రమవుతున్నందున, భారతదేశం నుండి మద్దతు చాలా అవ‌స‌రం. ఈ విష‌యంలో భారతదేశం యొక్క వాయిస్ ముఖ్యమైంద‌ని లెనైన్ అన్నారు.

తమ పౌరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉంటుందని అలాగే భారత్‌కు కూడా ఉక్రెయిన్ లోని భారతీయులను కాపాడుకోవడం తొలి ప్రాధాన్యతే అవుతుందన్నారు. ఉక్రెయిన్‌కు భారత్ మనవతా సాయం అందించడాన్ని ఆయన స్వాగతించారు.   రష్యాతో భారత్ కు మంచి సంబంధాలున్నాయ‌నీ, త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో మానవతా తీర్మానానికి భార‌త్ మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.

ఉక్రెయిన్‌పై రష్య సైనిక చర్యలను వ్య‌తిరేకిస్తూ..  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టిన 
 తీర్మాన ఓటింగ్ కు భారత్ తో పాటు 34 దేశాలు  దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్ సంక్షోభంపై జనరల్ అసెంబ్లీ సమావేశానికి పిలుపునిచ్చేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విధానపరమైన ఓటింగ్‌కు భారత్ ఇంతకుముందు గైర్హాజరైంది. అలాగే.. గత వారం ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యలను వ్యతిరేకిస్తూ.. ఐక్య‌రాజ్య సమితి భ‌ద్ర‌తా మండలిలో అమెరికా  ప్ర‌వేశ‌పెట్టిన‌ తీర్మానానికి భారత్‌తో పాటు చైనా, యుఎఇ దూరంగా ఉన్నాయి. తీర్మానానికి వ్యతిరేకంగా పుతిన్ తన వీటోను ఉపయోగించారు.దీంతో ఈ తీర్మానం వీగిపోయింది.

ఇదిలా ఉంటే.. ర‌ష్యా వ్లాదిమిర్ పుతిన్ తో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇరువురు నేతలు దాదాపు 90 నిమిషాలు పాటు మాట్లాడుకున్న‌ర‌ట‌. విశ్వనీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు పుతిన్ మాటలను బట్టి చూస్తే.. ఈ దాడిని కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్న‌డ‌ట‌.  ఉక్రెయిన్ మొత్తాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవడమే పుతిన్ లక్ష్యమని, పుతిన్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే... ఉక్రెయిన్ ను నాజీయిజం నుంచి విముక్తి కల్పించడానికి సదరు ఆపరేషన్ చేపడుతున్నారట‌. అయితే, ఫ్రాన్స్ దేశాధినేత మేక్రాన్ మాత్రం ర‌ష్యా వైఖరిని ఖండించారని, అంతేకాకుండా, పౌరులపై దాడులు చేయవద్దని కోరారని, మానవతాదృక్పథంతో చేసే సాయాన్ని ఉక్రెయిన్ పౌరులకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారని స‌మాచారం.

PREV
click me!

Recommended Stories

World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే
Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి