కఠినమైన పొరుగువారి మధ్యలో భారత్ ఉంది.. భారత రాయబారిగా నామినేట్ అయిన ఎరిక్ మైఖేల్

Published : Dec 15, 2021, 10:59 AM ISTUpdated : Dec 15, 2021, 11:01 AM IST
కఠినమైన పొరుగువారి మధ్యలో భారత్ ఉంది.. భారత రాయబారిగా నామినేట్ అయిన ఎరిక్ మైఖేల్

సారాంశం

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో ఆ దేశ తదుపరి రాయబారిగా (US envoy to india) ఎరిక్ మైఖేల్ గార్సెట్టి (Eric Michael Garcetti) పేరును నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే ఎరిక్ మైఖేల్ చట్టసభ సభ్యులతో మాట్లాడుతూ.. భారత్ కఠిన పొరుగు ప్రాంతంలో (tough neighbourhood) ఉందని గమనించినట్టుగా చెప్పారు. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌లో ఆ దేశ తదుపరి రాయబారిగా (US envoy to india) ఎరిక్ మైఖేల్ గార్సెట్టి (Eric Michael Garcetti) పేరును నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి ఎరిక్ మైఖేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కఠిన పొరుగు ప్రాంతంలో (tough neighbourhood) ఉందని గమనించినట్టుగా చెప్పారు. మంగళవారం చట్టసభ సభ్యులతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందిచారు. సరిహద్దులను భద్రపరుచుకోవడానికి, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి, దాడులను అరికట్టడానికి.. భారత్ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేస్తామని ఎరిక్ మైఖేల్ చెప్పారు. 

ఇక, 50 ఏళ్ల ఎరిక్ మైఖేల్.. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ మేయర్‌గా (Mayor of Los Angeles) పనిచేస్తున్నారు. గతంలో ఆయన US నేవీ రిజర్వ్ కాంపోనెంట్‌లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్‌గా 12 సంవత్సరాలు పనిచేశారు. ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యక్తిగతంగా చాలా నమ్మకస్తునిగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనను భారత్‌లో రాయబారిగా నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే రాయబారి పదవికి తన పేరును ధృవీకరించే విచారణ సందర్భంగా ఎరిక్ మైఖేల్ చట్టసభ సభ్యులతో.. ‘భారతదేశం కష్టతరమైన పొరుగు దేశాల మధ్య ఉంది. రాయబారిగా నా పేరు ధృవీకరించబడితే.. భారత్ సరిహద్దులు, సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి, దాడులను అరికట్టడానికి ఆ దేవ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి నేను యూఎస్ ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్తాను’ అని చెప్పారు. 

‘సమాచారాన్ని పంచుకోవడం, తీవ్రవాద వ్యతిరేకతను సమన్వయం చేయడం, నావిగేషన్ పెట్రోలింగ్‌ల ఉమ్మడి స్వేచ్ఛ,  సైనిక వ్యాయామాలు (నేను నా భారతీయ సహచరులతో కలిసి నావికాదళ అధికారిగా పాల్గొన్నాను), మా అత్యుత్తమ రక్షణ సాంకేతికతలను విక్రయించడం ద్వారా.. ఇరుదేశాల గొప్ప రక్షణ భాగస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నాలు చేస్తాను’ అని ఎరిక్ మైఖేల్ చెప్పారు.

అంతర్జాతీయ సౌర కూటమి (ISA), ఎజెండా 2030 Climate and Clean Energy Partnership ద్వారా గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు, ధైర్యంగా సమర్థించడానికి భారతదేశంతో కలిసి పని చేస్తానని అతను ఎరిక్ మైఖేల్ చెప్పారు. ‘మన భాగస్వామ్యానికి మూలాధారం మన దేశాలను కలిపే మానవ సంబంధాలు. మన దేశాన్ని బలోపేతం చేసే నాలుగు మిలియన్ల భారతీయ-అమెరికన్ జనాభా ఉంది. దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులు, పదివేల మంది భారతీయ నిపుణులు మన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారు’ అని ఎరిక్ పేర్కొన్నారు. 

ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం, రాజ్యాంగాలలో పొందుపరచబడిన విలువలలో..  మానవ హక్కులు, బలమైన ప్రజాస్వామ్య సంస్థల పట్ల గౌరవం కీలకమైన అంశాలు అని ఎరిక్ తెలిపారు. తాను భారత రాయబారిగా నియమించబడితే.. ఈ సమస్యలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను అని పేర్కొన్నారు. తాను 1992లో హిందీ, భారతీయ సాంస్కృతి, మత చరిత్రను అభ్యసించి కళాశాల నుంచి పట్టభద్రుడిని అయ్యానని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే