Russia Ukraine War: బ‌యో వెప‌న్స్ ను నిషేధించాలి… ఐరాసలో భారత్‌ డిమాండ్‌

Published : Mar 19, 2022, 12:23 AM IST
Russia Ukraine War:  బ‌యో వెప‌న్స్ ను నిషేధించాలి… ఐరాసలో భారత్‌ డిమాండ్‌

సారాంశం

Russia Ukraine War: ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు కొన‌సాగిస్తున్న వేళ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి United Nations Security Council (UNSC) ప్ర‌త్యేక‌ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భార‌త్  జీవ, విషపూరిత ఆయుధాల ఒప్పందాన్నిBiological and Toxic Weapons Convention (BTWC)  అమలు చేయాలని UNలో డిమాండ్ చేసింది.    

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతూనే ఉంది. దాదాపు 24 రోజులుగా ర‌ష్యా సైనిక దాడులు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ మార‌ణాకాండ‌లో ఇప్ప‌టికే ఉక్రెయిన్ లోని ప‌లు ప్ర‌ముఖ న‌గ‌రాల‌ను ర‌ష్యా బ‌ల‌గాలు ఆక్ర‌మించాయి. ఇక రాజ‌ధాని న‌గ‌రం కీవ్ ను కూడా స్వాధీనం చేసుకోవ‌డానికి పెద్ద ఎత్తున్న బ‌ల‌గాల‌ను మోహ‌రించింది ర‌ష్యా. ఈ క్ర‌మంలో వేలాది మంది చ‌నిపోయారు. దాదాపు 30 లక్షల మంది ప్రజలు ప్రాణాలు చేతబట్టుకుని ఉక్రెయిన్ ను విడిచి పారిపోయారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చల్లో సానుకూల పరిష్కారం లభించాలని పలు దేశాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి.

ఈ త‌రుణంలో బ‌యో వెప‌న్స్ ప్రస్తావ వ‌చ్చింది.  శుక్రవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో జీవాయుధాలను (Biological Weapons) నిషేధించాలని భారత్ డిమాండ్‌ చేసింది.
బయోలాజికల్ అండ్ టాక్సిక్ వెపన్స్ కన్వెన్షన్ (BTWC) పూర్తి స్థాయిలో అమలు చేయాల‌ని భార‌త్  మ‌రోసారి ప్ర‌స్త‌వించింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి జీవాయుధాల అంశమే ప్రధాన ఆరోపణగా ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్‌తోపాటు అమెరికా, రష్యా ఇతర దేశాలు ఈ అంశంపైనే ప్రధానంగా మాట్లాడాయి. 

ఈ సంద‌ర్భంగా భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి (DPR) ఆర్‌ రవీంద్ర భార‌త్  తరుఫున అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవాయుధాలకు సంబంధించి (BTWC)ని పూర్తి స్ఫూర్తితో, సమర్థవంతంగా అమలు చేయాల‌ని, అది చాలా ముఖ్యమని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన ఏ విషయమైనా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం సంప్రదింపులు, సహకారం ద్వారా పరిష్కరించాలని భారత్‌ భావిస్తొందని తెలిపారు..
అలాగే..యుద్ధాన్ని ముగించడానికి చ‌ర్చ‌లు సానుకూలంగా జ‌ర‌గాల‌ని భార‌త్ ఆశిస్తుందని తెలిపారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది భారత్. "రష్యా-ఉక్రెయిన్ మధ్య తాజా దౌత్య చర్చలను మేము స్వాగతిస్తున్నాము. శత్రుత్వాలను తక్షణమే విరమించుకోవడం, చర్చ‌లే దౌత్యానికి  మార్గమని మేము నమ్ముతున్నాము" అని రవీంద్ర అన్నారు. యుఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టాలు, సార్వభౌమాధికారం, రాష్ట్రాల ప్రాదేశిక సమగ్రత సూత్రాలను గౌరవించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని అభిప్రాయాన్నివ్య‌క్తం చేస్తున్నామ‌ని తెలిపారు. 


బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ (BTWC)

బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ అనేది నిరాయుధీకరణ ఒప్పందం, ఇది జీవ, టాక్సిన్ ఆయుధాలను సమర్థవంతంగా నిషేధిస్తుంది. ఉక్రెయిన్‌లో బ‌యో వెప‌న్స్ సంబంధించిన  కార్యకలాపాలకు అమెరికా నిధులు సమకూరుస్తోందని గతంలో రష్యా పేర్కొంది. ఉక్రేనియన్ భూభాగంలో పెంటగాన్ సంబంధించిన‌ 30కి పైగా బయోలాజికల్ లాబొరేటరీల నెట్‌వర్క్‌ను రూపొందించిందని రష్యన్ సాయుధ దళాల రేడియేషన్, కెమికల్, బయోలాజికల్ డిఫెన్స్ చీఫ్ ఇగోర్ కిరిల్లోవ్ చెప్పారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను యుఎస్, ఉక్రెయిన్ ప్రభుత్వాలు రెండూ దీనిని ఖండించాయి. 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే