సిద్ధుకి మద్దతుగా నిలిచిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

Published : Aug 21, 2018, 04:14 PM ISTUpdated : Sep 09, 2018, 11:11 AM IST
సిద్ధుకి మద్దతుగా నిలిచిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

సారాంశం

తన ప్రమాణస్వీకారానికి వచ్చిన సిద్దూకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దూ రెండు దేశాల మధ్య శాంతికి అంబాసిడర్ అంటూ కొనియాడారు. 

పాకిస్థాన్ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన మిత్రుడు, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధు వెళ్లడం తీవ్ర విమర్శలకు దారితీసింది. సిద్ధు పాక్ వెళ్లడమే కాకుండా  పాక్ ఆర్మీ చీఫ్ ని కౌగిలించుకోవడం అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. తాను చేసింది తప్పు కాదని ఒకవైపు సిద్ధు తనను తాను సమర్థించుకుంటున్నప్పటికీ విమర్శలు మాత్రం ఆగడం లేదు.

కాగా.. తాజాగా సిద్ధుకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు పలికారు. తన ప్రమాణస్వీకారానికి వచ్చిన సిద్దూకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సిద్దూ రెండు దేశాల మధ్య శాంతికి అంబాసిడర్ అంటూ కొనియాడారు. సిద్ధుని టార్గెట్ చేసుకోవడం ద్వారా ఉపఖండంలో శాంతి ప్రక్రియకు మోకాలడ్డుతున్నారని ఆయన విమర్శలకు తప్పుపట్టారు.
 
మంగళవారంనాడిక్కడ మీడియాతో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ తెరచేందుకు సన్నాహాలు చేస్తున్నామని పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా చెప్పడంతో భావోద్వేగంతో చేసుకున్న 'హగ్' అదని చెప్పారు. సిద్దూ సైతం అంతకు ముందే ఇదే విషయాన్ని చెబుతూ, కారిడార్ తెరుస్తామని బజ్వా చెప్పడం భావోద్వేగం కలిగించే సందర్భమనిఅన్నారు. రాజకీయ పర్యటన కోసం పాక్ వెళ్లలేదని, తన మిత్రుడి ఆహ్వానం మేరకే వెళ్లాలని చెప్పారు.

 

read more news..

పాక్ వెళ్తే తప్పేంటి..? సమర్థించుకున్న సిద్ధు

సిద్ధూ తల తెస్తే రూ. 5 లక్షల బహుమతి

ఇమ్రాన్ ప్రమాణస్వీకారం.. సిద్ధు ఎక్కడ కూర్చున్నాడంటే...

పాక్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్ ఖాన్

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే