15 ఏళ్లుగా సిక్ లీవ్‌లోనే ఉన్నాడు.. జీతం పెంచలేదని కోర్టుకు వెళ్లాడు!

By Mahesh KFirst Published May 14, 2023, 7:36 PM IST
Highlights

ఐబీఎం ఉద్యోగి ఒకరు సిక్ లీవ్‌లో 15 ఏళ్లుగా ఉంటున్నాడు. అయితే.. తనకు జీతం పెంచడం లేదని కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
 

న్యూఢిల్లీ: ఓ సీనియర్ ఐటీ వర్కర్ 2008 నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. అతనికి కంపెనీ రూల్స్ ప్రకారం సాలరీ అందుతూనే ఉన్నది. కానీ, తనకు వస్తున్న జీతంలో పెరుగుదల లేదని ఆ కంపెనీని కోర్టుకు ఈడ్చాడు. 15 ఏళ్లుగా సిక్ లీవ్‌లో ఉన్న ఐబీఎం ఉద్యోగి ఇయాన్ క్లిఫర్డ్‌కు సంబంధించిన స్టోరీ ఇది. లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆయన 2013 నుంచి మెడికల్లీ రిటైర్డ్.

డిజేబిలిటీ డిస్క్రిమినేషన్‌కు తాను బాధితుడినని అతను చెప్పుకుంటున్నాడు. 15 ఏళ్లుగా తనకు వస్తున్న జీతంలో హైక్ లేదని పేర్కొంటున్నాడు. ఐబీఎం కంపెనీ ప్లాన్ ప్రకారం, ఆ ఐటీ స్పెషలిస్ట్ ఏడాదికి 54 వేల పౌండ్లకు మించి జీతం అందుకుంటున్నాడు. ఆయనకు 65 ఏళ్లు నిండే వరకు ఇలా జీతం వస్తూనే ఉంటుంది. అలా హెల్త్ ప్లాన్ ఉండటమే గొప్ప. కానీ, ఆ ఉద్యోగి మాత్రం ఆ ప్లాన్ సరిగా లేదని, ద్రవ్యోల్బణంతో తన జీతం రాను రాను విలువ తగ్గిపోతుందని వాదిస్తున్నాడు.

ఇయాన్ క్లిఫర్డ్ 2008 సెప్టెంబర్‌లో సిక్ లీవ్ పై వెళ్లాడు. 2013 వరకు ఆయన సిక్ లీవ్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన బాధను చెప్పుకున్నాడు. ఆయన కంప్లైంట్ ఆధారంగా ఐబీఎం ఆయనకు కంప్రమైజ్ అగ్రిమెంట్ ఆఫర్ చేసింది. దీని ప్రకారం, ఆయనను కంపెనీ డిజేబిలిటీ ప్లాన్ కిందకు తీసుకుని డిస్మిస్ చేయకుండా ఉంచుతుంది. ఆయన వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జీతం కూడా 75 శాతం ఇస్తారు. 

Also Read: సెక్స్ రాకెట్‌లో ఇద్దరు హీరోయిన్‌ల పట్టివేత.. వ్యభిచారం నిర్వహిస్తున్న ఏజెంట్ల అరెస్టు

ఆయన జీతం 73,037 పౌండ్లు. 2013 నుంచి 25 శాతం కోతతో 54,028 పౌండ్లు ఆయనకు యేటా ముడుతున్నది. కానీ, దీనిపైనా ఆ ఉద్యోగి కంపెనీని కోర్టుకు తీసుకెళ్లాడు.

ఈ పిటిషన్ విచారించిన జడ్జీ హౌస్‌గో విచారిస్తూ.. యాక్టివ్‌గా ఉండి వర్క్ చేస్తున్న ఉద్యోగులకు జీతం పెరుగుతుందని, పనిలో లేని ఉద్యోగికి జీతం పెంచడం ఇందుకు భిన్నమైనదని తెలిపారు. డిజేబిలిటీ ఉన్నవారికి మిగతా ఉద్యోగులకు పెంచినట్టు జీతం పెంచడం లేదని వాదిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, ఈ ప్లాన్ కేవలం డిజేబిలిటీ వారికి మాత్రమే కాబట్టి ఆ వాదన చెల్లదని అన్నారు. ఏడాదికి 50 వేల పౌండ్లు 30 ఏళ్లకు లెక్కించి అందులో సగం చేసినా భారీ మొత్తమే ఆ డిజేబిలిటీ క్యాండిడేట్ పొందుతాడని జడ్జీ తెలిపారు. ఇది డిజేబిలిటీ ఉద్యోగిని మంచిగా ట్రీట్ చేసినట్టే అవుతుందని వివరించారు. 

click me!