తాలిబన్ల భయం.. పాకిస్తాన్ సరిహద్దుకు పోటెత్తిన ఆఫ్ఘన్లు, కాబూల్ కంటే దారుణ పరిస్థితులు

By Siva KodatiFirst Published Aug 26, 2021, 3:46 PM IST
Highlights

దేశం విడిచిపోయేందుకు గాను వేలాది మంది ఆఫ్ఘన్లు పాకిస్తాన్ సరిహద్దుకు పోటెత్తారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని వీడియోలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోను నతీఖ్ మాలిక్జాదా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకోవడంతో ఆఫ్ఘన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు ఎక్కడికక్కడ కట్టడి చేస్తుండటంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పించుకుని వెళ్లేందుకు ఉన్న అన్ని మార్గాలనూ ఆఫ్ఘనిస్థానీలు వెతుక్కుంటున్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఏ విమానం దొరికితే ఆ విమానమెక్కి ఇప్పటికే చాలా మంది దేశం దాటేశారు. బతుకు మీద గంపెడాశతో దేశం దాటేందుకు ఇంకా చాలా మంది మూటాముల్లె సర్దుకుని బయల్దేరుతున్నారు. ఆ వలసలు ఒక్క కాబూల్‌కే పరిమితం కాలేదు. వేరే ఇతర నగరాల్లోనూ జరుగుతున్నాయి.

తాజాగా పాకిస్థాన్ సరిహద్దులను దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్ స్పిన్ బోల్దక్ బార్డర్ కు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తారు. ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయని వీడియోలు చెబుతున్నాయి. దానికి సంబంధించిన వీడియోను నతీఖ్ మాలిక్జాదా అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ALso Read:9/11 దాడుల్లో లాడెన్ హస్తం లేదు : అమెరికాపై తాలిబాన్ల షాకింగ్ కామెంట్లు

ఇది కాబూల్ ఎయిర్ పోర్టు కాదని.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవేశించేందుకు వేలాది మంది ఆఫ్ఘన్లు పోటెత్తిన స్పిన్ బోల్దక్ సరిహద్దు  అని ట్వీట్ చేశారు. కాబూల్ ఎయిర్‌పోర్టు దగ్గరి పరిస్థితుల కన్నా ఇక్కడ ఇంకా దారుణమైన పరిస్థితులున్నాయని నతీఖ్ చెప్పారు. అయితే, విదేశీ బలగాలేవీ ఇక్కడ లేకపోవడం వల్లే మీడియా ఎక్కువ కవరేజీ ఇవ్వడం లేదని నతీఖ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. కాగా, ఒక్క పాకిస్థాన్ సరిహద్దుల వద్దే కాకుండా.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ సరిహద్దులకు ఆఫ్ఘన్లు తరలిపోతున్నట్టు తెలుస్తోంది

click me!