జపాన్ లో తీవ్ర భూకంపం, నలుగురు మృతి.. అంధకారంలో లక్షలాది మంది...

Published : Mar 17, 2022, 08:30 AM ISTUpdated : Mar 17, 2022, 08:34 AM IST
జపాన్ లో తీవ్ర భూకంపం, నలుగురు మృతి.. అంధకారంలో లక్షలాది మంది...

సారాంశం

జపాన్ ను భారీ భూకంపం భయకంపితుల్ని చేసింది. తీవ్ర స్థాయిలో ఏర్పడిన భూకంపం కారణంగా నలుగురు మృతి చెందారు. 90 మందికి పైగా గాయాలయ్యాయి. లక్షలాది మంది అంధకారంలో ఉండిపోయారు. సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

టోక్యో : తూర్పు Japanలో బుధవారం రాత్రి శక్తివంతమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. చాలా ప్రాంతాల్లో ప్రభావం చూసిన ఈ Earthquake కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. అంతేకాదు Tsunamiహెచ్చరికలు జారీ చేశామని అధికారులు గురువారం తెలిపారు. బుధవారం అర్ధరాత్రికి కొద్దిసేపటి ముందు 7.4 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం తరువాత, దేశంలోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేసే ప్రయత్నం గురువారం ప్రారంభించారు. 

ఈశాన్య జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం కారణంగా సాధారణం కంటే 30 సెంటీమీటర్ల వరకు నీటి మట్టాలు పెరిగినట్టు అధికారులు గమనించారు. దీంతో ఈశాన్య జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని గ్రహించి, గురువారం తెల్లవారుజామున  సునామీ హెచ్చరిక లు జారీ చేశారు. తీవ్రమైన అలలు బుధవారం రాత్రి నుంచి, గురువారం ఉదయం వరకు ఈ ప్రాంతాన్ని తాకడం కొనసాగింది.

జపాన్ లో ఇలాంటివి సాధారణమే అయితే.. ఈ సారి నష్టం అంతగా కనిపించలేదు. ఇక అణు కర్మాగారాలలో ఎటువంటి అసాధారణతలు లేవని అధికారులు తెలిపారు. "నష్టం పరిధిని అంచనా వేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం" అని ప్రభుత్వ ప్రతినిధి హిరోకాజు మట్సునో రాత్రి విలేకరులతో అన్నారు.

"మొదటి భూకంపం సంభవించిన కొన్ని రోజుల తర్వాత తరచుగా పెద్ద ప్రకంపనలు సంభవిస్తాయి, కాబట్టి దయచేసి కూలిపోయిన భవనాలు... ఇతర అధిక-ప్రమాదకర ప్రదేశాల నుండి దూరంగా ఉండండి," అన్నారాయన. ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ప్రకారం, భూకంపం కారణంగా నలుగురు వ్యక్తులు మరణించారు, ఫుకుషిమా ప్రాంతంలో ఒకరు, పొరుగున ఉన్న మియాగిలో మరొకరు మరణించారు, అనేక ప్రాంతాలలో 90 మందికి పైగా గాయపడ్డారు.

ఫుకుషిమా తీరానికి 60 కిలోమీటర్ల (37 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని, నిమిషాల ముందు అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో మరో బలమైన కంపనం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. రాత్రి సంభవించిన భూకంపం తీర ప్రాంతంలోని ఈశాన్య ప్రాంతంలో బలమైన ప్రకంపనలు సృష్టించింది, భూకంపం తీవ్రతకు దుకాణాలు, పుస్తకాల షాపుల్లో నుండి వస్తువులు, పుస్తకాలు విసురుగా రోడ్డు మీద పడ్డాయి. ఇళ్లలో సామానంతా కింద పడిపోయింది. 

ఈ కుదుపులు జపాన్ రాజధానిని కూడా చుట్టుముట్టాయి. దీని ప్రభావంతో కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో టోక్యో మరికొన్ని ప్రాంతాలు తాత్కాలికంగా చీకటిలోకి నెట్టాయి. భూకంపం సంభవించిన వెంటనే రాజధానిలో, ఇతర ప్రాంతాలలో దాదాపు రెండు మిలియన్ల ఇళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంగా విడతల వారీగా దాన్ని పునరుద్దరించారు. మియాగి, ఫుకుషిమా ప్రాంతాల్లోని దాదాపు 35,600 ఇళ్లలో గురువారం ఉదయం వరకు కూడా విద్యుత్ సరఫరా పునరుద్దరించబడలేదని విద్యుత్ సంస్థ టెప్కో తెలిపింది.

2011లో సునామీ తాకిడికి గురైనప్పుడు కనిపించినలాంటి అసాధారణతలు ఏవీ ఫుకుషిమా ప్లాంట్‌లో కనిపించలేదని జపాన్ న్యూక్లియర్ అథారిటీ తెలిపింది, అయితే కొన్ని రియాక్టర్‌ల వద్ద శీతలీకరణ కొలనుల కోసం ఏర్పాటు చేసిన పంపులు తాత్కాలికంగా ఆగిపోయినా కొద్దిసేపటికే మళ్లీ పని ప్రారంభించాయి. సెండై నగరంలోని అయోబా కోట స్థలంలో రాతి గోడ కూలిపోవడంతో పాటు ఫుకుషిమా నగరానికి ఉత్తరాన షింకన్‌సేన్ బుల్లెట్ రైలు పట్టాలు తప్పడంతో కొంత నష్టం నమోదైంది.
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే