
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దారుణానికి ఒడికట్టుతోంది. రోజురోజుకూ రష్యా దాష్టీకాలు మితిమిరిపోతున్నాయి. యుద్ద ప్రారంభంలో కేవలం సైనిక స్థావరాలనే టార్గెట్ చేసిన రష్యా.. ప్రజా నివాసాల మీద, అత్యవసర కేంద్రాలైన ఆస్పత్రుల మీద రష్యా సేనాలు దాడులకు తెగబడుతున్నాయి. తాజాగా తీరప్రాంత నగరమైన మేరియుపొల్ నగరంపై రష్యాన్ సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ క్రమంలోనే నగరంలోని ఒక థియేటర్‌పై రష్యా బాంబుల వర్షం కురిపించింది. దాడి సమయంలో వెయ్యి మందికిపైగా తలదాచుకుంటున్నారు. ఇందులో సగానికి పైగా చిన్నారులు, మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ ఘటనపై స్థానిక డిప్యూటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌పై యుద్ధంలో బుధవారం భారీ ప్రాణనష్టం సంభవించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అందులో వెయ్యి నుంచి 1200 మంది వరకు పౌరులు తలదాచుకున్నారని తెలిపారు. ఈ ఘటనలో ఎంత మంది చనిపోయారన్నది తెలియరాలేదు. కానీ, భారీ సంఖ్యలోనే మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. తాజాగా ఉక్రెయిన్ విడుదల చేసిన ఫోటోలను పరిశీలిస్తే.. ఆ థియేటర్ మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ.. రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి పాల్పడ్డాయని విమర్శించారు. మారియుపోల్‌లో జరిగిన మరో భయంకరమైన యుద్ధ నేరమనీ, ఇది పౌర ఆశ్రయం.. దీనిపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడులని ఆరోపించారు. ఈ దాడి సమయంలో వందలాది మంది పిల్లలు, వృద్ధులు ఈ థియేటర్లో ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు.
ఈ దాడి అనంతరం.. మార్చి 14న US కంపెనీ Maxar తీసిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఆ ఫోటోల్లో భవనం వెలుపల పేవ్‌మెంట్‌పై "పిల్లలు" అనే పదాన్ని రష్యన్ భాషలో వ్రాయబడిందని చూపిస్తుంది. థియేటర్‌పై వైమానిక దాడి చేయలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది, బాంబు దాడిలో ధ్వంసమైన థియేటర్ చిత్రాలను వారు టెలిగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగానే పౌరులపై మారణహోమానికి తెగబడుతున్నాయనీ మేరియుపొల్ నగర పాలక సభ్యులు ఆరోపించారు. రష్యా క్రూరత్వాన్ని మాటల్లో వర్ణించలేమని పేర్కొన్నారు. నిరాయుధులైన మహిళలు, వృద్ధులు, చిన్నారులు సహా ఎవరినీ శత్రువు వదలిపెట్టడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 2,400 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెపుతున్నారు. చనిపోయిన వారిలో చాలా మంది సామూహిక ఖననం చేస్తున్నట్టు తెలిపారు. దాదాపు 3 లక్షల మంది.నివాసితులు ఈ నగరంలో చిక్కుకున్నారని అంచనా వేస్తున్నారు. వీరిలో చాలా మంది కనీసం తాగాడానికి సరైన నీరు లేకుండా ఇబ్బంది పడుతున్నారనీ, వారికి విద్యుత్, గ్యాస్ నిలిపివేయబడ్డాయని, ఆహారం, ఔషధాల నిల్వలు అడుగంటుతున్నాయి. ఈ నగరాన్ని రష్యా సేనలు చుట్టుముట్టడం వల్ల మానవతా సాయం కూడా అందజేయడం కష్టమవుతోంది.
వందలాది మంది మారియుపోల్ నివాసితులు తలదాచుకున్న భవనంపై రష్యాన్ సేనలు వైమానిక దాడులకు పాల్పడటం తీవ్రమైన యుద్ద నేరంగా పరిగణిస్తున్నారు. రష్యన్ దళాలు ఉద్దేశపూర్వకంగానే థియేటర్‌ను ధ్వంసం చేశాయని మారియుపోల్ సిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉంటే.. కీవ్‌లో మరో ఇద్దరు పాత్రికేయులు బాంబు దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వార్తల సేకరణ నిమిత్తం వెళ్లిన ఫాక్స్‌న్యూస్ పాత్రికేయుల వాహనంపై బాంబు దాడి జరిగింది. అలాగే.. ఆ నగరంలో 12 అంతస్తుల అపార్ట్‌మెంటుపై దాడి జరగడం వల్ల ఆ భవంతి అగ్నికీలల్లో చిక్కుకుంది.