గ్రీస్, టర్కీల్లో భారీ భూకంపం.. 22 మంది మృతి, ఇంకా పెరిగే అవకాశం

By Siva KodatiFirst Published Oct 30, 2020, 6:56 PM IST
Highlights

శుక్రవారం గ్రీస్, టర్కీల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

శుక్రవారం గ్రీస్, టర్కీల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి సముద్రంలో చిన్నపాటి సునామీ సంభవించింది.

ఇజ్మిర్ తీర ప్రాంతానికి సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. ప్రకంపనల తీవ్రతకు పలు బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం శిథిలాల కింద పడి 22 మంది మృతి చెందగా, సుమారు 1000 మంది వరకు గాయపడినట్లు టర్కీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 

ఇజ్మీర్‌లో కనీసం 20 వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయని నగర మేయర్‌ తెలిపారు. అటు బోర్నోవా, బేరక్లిలో కూడా పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయని టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ ట్వీట్‌ చేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను చేపట్టింది.  

సోమోస్‌ ద్వీపంలోని నియాన్ కార్లోవేసియన్ పట్టణానికి ఈశాన్యంగా 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం వున్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. దీనిపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ సైతం ఇజ్మీర్ కోలుకోవాలని ట్వీట్ చేశారు. భూకంప బాధితులకు అండగా ఉంటామని.. సంబంధిత మంత్రులు, అధికారులు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు ఎర్డోగాన్ తెలిపారు. 
 

click me!