భవిష్యత్తులో మరిన్ని వైరస్‌ల దాడి: ఐపీబీఈఎస్ షాకింగ్ నివేదిక

By narsimha lodeFirst Published Oct 30, 2020, 6:08 PM IST
Highlights

రానున్న రోజుల్లో మరిన్ని వైరస్ లు మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంట్ సైన్స్ పాలసీ ఫ్లాట్ ఫాం ఆన్ బయోడైవర్శిటీ, ఎకో సిస్టమ్ ఐపీబీఈఎస్) వర్క్ షాప్   తెలిపింది.


జెనీవా: రానున్న రోజుల్లో మరిన్ని వైరస్ లు మనుషులపై దాడి చేసే అవకాశం ఉందని ఇంటర్ గవర్నమెంట్ సైన్స్ పాలసీ ఫ్లాట్ ఫాం ఆన్ బయోడైవర్శిటీ, ఎకో సిస్టమ్ ఐపీబీఈఎస్) వర్క్ షాప్   తెలిపింది.

ఈ వర్క్ షాప్ నివేదికను మీడియాకు విడుదల చేశారు. ప్రపంచంలోని 22 మంది ప్రముఖ నిపులు ఈ సదస్సులో పాల్గొన్నారు. జీవ వైవిద్యం, మహమ్మారిపై ఈ చర్చించారు.

ప్రకృతిలో 5,40,000 నుండి 8,50,000 తెలియని వైరస్ లు ప్రజలకు సంక్రమించగలవని నివేదిక హెచ్చరించింది. ఫ్రెంచ్ గయానాలో మాయరో వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందని డబ్ల్యుహెచ్ఓ నివేదించిన మూడు రోజుల తర్వాత ఈ నివేదిక వెలువడింది.

కరోనా కంటే భయంకరమైన  వైరస్ లు భవిష్యత్తులో మనుషులపై దాడి చేసే అవకాశం లేకపోలేదని ఐపీబీఈఎస్ నివేదిక తెలిపింది. వైరస్ దాడుల నుండి తప్పించుకోవడం కూడ సాధ్యమేనని సదస్సు అభిప్రాయపడింది.

వన్యప్రాణులు, సూక్ష్మజీవులు, వన్యప్రాణులు, పశుసంపద, ప్రజల మధ్య సంబంధాలు ఉండడంతో సూక్ష్మజీవులు వ్యాదులను వ్యాపింపజేస్తున్నాయని ఐపీబీఈఎస్ నివేదిక తెలిపింది.వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టానికి కారణమయ్యే మానవ కార్యకలాపాలు కూడా మహమ్మారి ప్రమాదాన్ని పెంచుతాయని ఈ నివేదిక అభిప్రాయపడింది.


 

click me!