స్వలింగ సంపర్కం...ఇద్దరు మహిళలకు కోర్టు ఏ శిక్ష విధించిందంటే....

By Arun Kumar PFirst Published Aug 14, 2018, 6:11 PM IST
Highlights

స్వలింగ సంపర్కానికి పాల్పడిన ఇద్దరు మహిళలను దోషులుగా తేల్చిన మలేషియా కోర్టు కఠిన శిక్షను విధించింది.  ఈ శిక్షను కూడా అప్పటికప్పుడే కోర్టు ఆవరణలోనే  విధించారు. షరియా చట్టాల ప్రకారం ఇలా అసహజ శృంగారం నేరమని, అందువల్లే ఇద్దరు మహిళలను శిక్షించినట్లు న్యాయమూర్తి తెలిపారు.

మలేషియాకు చెందిన ఓ 32 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువతితో స్వలింగ సంపర్కం జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ముస్లీం దేశమైన మలేషియాలో షరియా చట్టాలను పాటిస్తుంటారు. దీని ప్రకారం ఇలా స్వలింగ సంపర్కం నేరం. దీంతో ఈ ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి మహమ్మద్‌ ఖాస్మీజాన్‌ అబ్దుల్లా ఇవాళ తన తీర్పును వెల్లడించారు.

స్వలింగ సంపర్కంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళలలను దోషులుగా తేల్చిన న్యాయమూర్తి కఠిన శిక్షను విధించారు. ఇద్దరికి ఆరు కొరడా దెబ్బలతో పాటు 56 వేల నగదును జరిమానాగా విధించారు. అయితే వారికి కోర్టు ఆవరణలోనే శిక్షను అమలు చేశారు. ఇద్దరు మహిళలను కోర్టు ఆవరణలోనే కొరడాలతో కొట్టి దండించారు. ఇంకెవరు ఇలా అసహజ చర్యలకు పాల్పడకుండా కఠినంగా శిక్ష విధించడం జరిగిందని న్యాయమూర్తి మీడియాకు తెలిపారు.
 
click me!