పాక్‌లో హిందూ యువతి ఘనత: పోలీస్ అధికారిగా ఎంపిక

By Siva KodatiFirst Published Sep 5, 2019, 10:25 AM IST
Highlights

సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పుఫ్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో పాక్‌లో పోలీస్ అధికారిగా ఎంపికైన తొలి హిందూ యువతిగా ఆమె చోటు దక్కించుకుంది. సింధ్ ప్రావిన్స్‌లో పుఫ్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్లు జియో న్యూస్ వెల్లడించింది. 

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ మైనార్టీ వర్గంగా ఉన్న హిందువుల హిందువులపై ముస్లింలు దాడులకు పాల్పడటమే కాకుండా.. హిందూ మతానికి చెందిన యువతులపై అత్యాచారాలు, బలవంతపు మత మార్పిడిలకు లెక్కే లేదు. అలాంటి చోట ఓ హిందూ యువతి పోలీస్ అధికారిగా ఎంపికైంది.

సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పుఫ్ఫా కొల్హి అనే యువతి ఏఎస్సైగా ఎంపికైంది. దీంతో పాక్‌లో పోలీస్ అధికారిగా ఎంపికైన తొలి హిందూ యువతిగా ఆమె చోటు దక్కించుకుంది.

సింధ్ ప్రావిన్స్‌లో పుఫ్ఫా కొల్హికి పోస్టింగ్ ఇచ్చినట్లు జియో న్యూస్ వెల్లడించింది. జనవరిలో హిందూ సామాజికవర్గానికి చెందిన సుమన్ పవన్ బోదాని సివిల్ మెజిస్ట్రేట్‌గా నియమితులైన విషయం తెలిసిందే. 
 

click me!