లేటెస్ట్ గన్‌తో....కుటుంబసభ్యులపై బాలుడి కాల్పులు: ఐదుగురు మృతి

Siva Kodati |  
Published : Sep 03, 2019, 06:52 PM IST
లేటెస్ట్ గన్‌తో....కుటుంబసభ్యులపై బాలుడి కాల్పులు: ఐదుగురు మృతి

సారాంశం

అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది. సోమవారం రాత్రి ఎక్‌మౌంట్‌ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలుడు ఐదుగురు కుటుంబసభ్యుల్ని కాల్చి చంపాడు. 

అమెరికాలో జరుగుతున్న వరుస కాల్పుల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గత వారం టెక్సాస్‌లో జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించిన సంఘటన మరిచిపోక ముందే మరో ఘటన జరిగింది.

సోమవారం రాత్రి ఎక్‌మౌంట్‌ పట్టణంలో ఓ 14 ఏళ్ల బాలుడు ఐదుగురు కుటుంబసభ్యుల్ని కాల్చి చంపాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి లొంగిపోయాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు.

విచారణలో బాలుడు నేరాన్ని అంగీకరించాడు. అతను ఉపయోగించిన తుపాకీ అత్యంత ఆధునాతనమైనదని... ఇది కుర్రాడి వద్దకు ఎలా చేరిందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు సొంత కుటుంబసభ్యుల్ని చంపడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. 
 

PREV
click me!

Recommended Stories

USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?
సరిగ్గా వందేళ్ల సీన్ రిపీట్... 1926 పరిస్థితులే 2026 లో కూడా.. ఇక అమెరికా పరిస్థితి అంతేనా..?