ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ... హమాస్ నేత మహమ్మద్ సిన్వార్ హతం

Published : May 28, 2025, 09:07 PM IST
ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ ... హమాస్ నేత మహమ్మద్ సిన్వార్ హతం

సారాంశం

గాజాలోని హమాస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ లో కీలక నేత హతమయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని ధృవీకరించారు.  

Mohammad Sinwar Killed : గాజాపై జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత మహమ్మద్ సిన్వర్ మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం ధృవీకరించారు. ఇజ్రాయెల్ వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతడు ఒకరు… హమాస్ నేత యాహ్యా సిన్వర్ తమ్ముడు. యాహ్యా సిన్వార్‌ను ఇజ్రాయెల్ సైన్యం ఇంతకుముందే హతమార్చింది.

మహమ్మద్ సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఇంతకుముందే ప్రకటించింది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు ఆయన మరణాన్ని ధృవీకరించారు. దక్షిణ గాజాలోని యూరోపియన్ హాస్పిటల్ కింద ఉన్న హమాస్ కమాండ్ సెంటర్‌లో మహమ్మద్ సిన్వర్ దాక్కున్నాడు. అయినా కూడా ప్రాణాలతో బయటపడలేకపోయాడు. ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసి అతన్ని హతమార్చింది. ఈ దాడిలో హమాస్ రాఫా బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ షబానా కూడా మరణించినట్లు సమాచారం.

యాహ్యా సిన్వార్ మరణం తర్వాత మహమ్మద్ సిన్వార్ కు కీలక బాధ్యతలు

అక్టోబర్ 2023లో యాహ్యా సిన్వర్ మరణం తర్వాత మహమ్మద్ సిన్వర్‌కు గాజా దక్షిణ ప్రాంతంలో సీనియర్ నాయకత్వ పాత్ర లభించింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్‌పై జరిగిన భారీ దాడికి యాహ్యా సూత్రధారి. దీంతో ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసింది. అప్పటి నుంచి యుద్ధం కొనసాగుతోంది.

హమాస్ సైనిక విభాగంలో మహమ్మద్ సిన్వర్ చాలా కాలంగా ఉన్నాడు. అతన్ని అత్యంత సీనియర్ కమాండర్లలో ఒకరిగా పరిగణిస్తారు. యాహ్యా మరణం తర్వాత మహమ్మద్ సిన్వర్ పదవి మరింత పెరిగింది. అతడు కీలక నాయకుడిగా మారాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే