World Food Program: ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు.. తీవ్రమైన ఆకలి పరిస్థితుల్లో సగం జనాభా

Published : May 11, 2022, 11:49 AM IST
World Food Program: ఆఫ్ఘన్‌లో ఆకలి కేకలు.. తీవ్రమైన ఆకలి పరిస్థితుల్లో సగం జనాభా

సారాంశం

Afghanistan's Taliban: ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టిస్తున్నారు. దేశంలోని జనాభాలో సగం మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నార‌ని ఐక్యారాజ్య స‌మితి ప్ర‌పంచ ఆహార కార్య‌క్ర‌మం (డ‌బ్ల్యూఎఫ్‌పీ) రిపోర్టులు పేర్కొంటున్నాయి.   

hunger:  తాలిబ‌న్ల పాల‌న‌లో ఆఫ్ఘనిస్తాన్ లో ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్ఘ‌న్‌ను ప్ర‌స్తుతం ఆహార‌కొర‌త వేధిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ప్ర‌జ‌లు ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టిస్తున్నారు. దేశంలోని జనాభాలో సగం మంది తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నార‌ని ఐక్యారాజ్య స‌మితి ప్ర‌పంచ ఆహాక కార్య‌క్ర‌మం (డ‌బ్ల్యూఎఫ్‌పీ) రిపోర్టులు పేర్కొంటున్నాయి. United Nations World Food Program (WFP) నివేదిక ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్ జనాభాలో దాదాపు సగం మంది తీవ్రమైన ఆకలి మరియు దీర్ఘకాలిక కరువు మరియు లోతైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ అంతటా మిలియన్ల మంది ప్రజల జీవనోపాధికి ముప్పు కలిగిస్తుందని పేర్కొంది.  "19.7 మిలియన్ల మంది, ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు సగం మంది ఆక‌లి కొర‌ల్లో చిక్కుకున్నారు" అని డ‌బ్ల్యూఎఫ్‌పీ పేర్కొంది. 

యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO)తో సహా ఫుడ్ సెక్యూరిటీ మరియు అగ్రికల్చర్ క్లస్టర్ భాగస్వాములు 2022 జనవరి మరియు ఫిబ్రవరిలో నిర్వహించిన తాజా ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) విశ్లేషణ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్  స‌గానికి పైగా జనాభా తీవ్రమైన ఆకలిని ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) మరియు అనేక NGOల నివేదిక‌ల ప్రకారం.. ఈ ప‌రిస్థితులు రోజురోజుకూ మ‌రింత‌గా దిగ‌జారుతున్నాయి. తిన‌డానికి తిండి దొర‌క‌ని జ‌నాభా క్ర‌మంగా పెరుగుతోంది. కఠినమైన శీతాకాల నెలలలో మానవతా సహాయంతో ఒక మ‌హా విపత్తును నివారించిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌స్తుతం దేశంలో ఆక‌లి తీవ్ర స్థాయిలో ఉంది. ఇదిలావుండ‌గా, వ్య‌వ‌సాయం విష‌యంలో తాలిబ‌న్లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌డంతో ప‌రిస్థితుల్లో పెద్ద‌గా మార్పు రాలేదు. 

ఆక‌లి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొవ‌డానికి దేశంలోని చాలా మంది త‌మ శ‌రీర అవ‌య‌వాల‌ను అమ్ముకోవ‌డం ఆఫ్ఘ‌న్ లో నెల‌కొన్న దారుణ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతోంది. ఎక్క‌డైనా ఆహారం అందిస్తుంటే ఆ ప్రాంతాల్లో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌నిపించ‌డం ఆఫ్ఘ‌న్ ఆక‌లిమంట‌ల‌కు స్ప‌ష్టం చేస్తోంది. ప్ర‌పంచ దేశాలు ఆఫ్ఘ‌న్ ఆక‌లి కొర‌త‌ను అధిగ‌మించ‌డానికి సాయం చేయాల‌ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు పేర్కొంటున్నాయి. ఇదిలావుండ‌గా... దేశంలో ఆహార కొర‌త‌ను ఎద‌ర్కొనేందు చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆఫ్ఘ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ముఖ్యంగా దేశంలోని దేశంలో పిల్లలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి వ్యూహాత్మక మరియు ఆహార అభద్రతా ప్రణాళికను పరిశీలిస్తున్నట్లు  ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. "ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క శాశ్వత ఆర్థిక వ్యూహంలో, ఆఫ్ఘనిస్తాన్ యొక్క మౌలిక సదుపాయాల పునర్నిర్మాణం చేర్చబడింది" అని ఆర్థిక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అమన్ నజారీ తెలిపారు. 

ఇదిలా ఉండగా, ఆఫ్ఘ‌న్ లో ఉపాధి దొర‌కని ప‌రిస్థితులు కూడా క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు ఉపాధిని కోల్పోతున్న వారి సంఖ్య కూడా అధికం అవుతున్న‌ద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2021 చివరి మూడు నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 500,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌ఓ) తాజా అంచనాలో పేర్కొంది. ఇది మున్ముందు ఇలాగే ప‌రిస్థితులు కొన‌సాగితే ప్ర‌జ‌ల ఆర్థిక ప‌రిస్థితులు దారుణంగా మారుతాయ‌ని విశ్లేషకులు అంచ‌నా వేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే