సైనిక కవాతుపై ఉగ్రదాడి: 29 మంది మృతి

By narsimha lodeFirst Published Sep 23, 2018, 12:52 PM IST
Highlights

ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతున్న సమయంలో నలుగురు దుండగులు జరిపిన కాల్పుల్లో 29 మంది మృత్యువాత పడ్డారు.

ఇరాన్:ఇరాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతున్న సమయంలో నలుగురు దుండగులు జరిపిన కాల్పుల్లో 29 మంది మృత్యువాత పడ్డారు.  మరో 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్ పరిధిలోని ఆవాజ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

సైనికుల కవాతు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. కవాతును తిలకించేందుకు వచ్చిన ప్రజలు, అధికారులు కూడ ఈ ఘటనలో మృతి చెందారు.  అయితే  ఈ ఘటనకు పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.  ఈ దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతాదళాలు కాల్చి చంపాయి.

అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ అన్నారు.1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్‌ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్‌ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు.
 

Last Updated Sep 23, 2018, 12:52 PM IST