Latest Videos

అమెరికా కాదు అంతరిక్షానికి వెళ్లిన అదే దేశభక్తి ... ప్రతి ఇండియన్ మనసు దోచుకున్న తెలుగుబిడ్డ... 

By Arun Kumar PFirst Published May 22, 2024, 11:49 AM IST
Highlights

విదేశాల్లో స్థిరపడిన ఓ తెలుగు బిడ్డ చాటిన దేశభక్తికి యావత్ భారతీయులు ఫిదా అవుతున్నారు. అంతరిక్షయానం చేసిన భారత సంతతి వ్యక్తి గోపిచంద్ తోటకూర అంతగొప్ప పని ఏం చేసారంటే... 

తెలుగు బిడ్డ గోపిచంద్ తోటకూట పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. అమెరికాలో స్థిరపడిన యువకుడు మూడుపదుల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. అంతరిక్షంలోకి వెళ్ళివచ్చిన భారతీయుడిగా గోపిచంద్ నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ కు చెందిన 'బ్లూ ఆరిజన్' సంస్థ చేపట్టిన న్యూ షెపర్డ్-25 మిషన్ ద్వారా అంతరిక్షయానం చేసారు గోపీచంద్. 

అమెరికాకు చెందిన బ్లూ ఆరిజన్ అనేది అంతరిక్ష ప్రయోగాలు చేసే ప్రైవేట్ సంస్థ. ఇప్పటికే ఈ సంస్థ అనేక అంతరిక్ష పరిశోదనలు చేసింది... అంతేకాదు మానవసహిత అంతరిక్షయానం కూడా చేసింది. ఇలా ఇప్పటికే ఆరుసార్లు మానవసహిత అంతరిక్ష యాత్రను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసిన బ్లూ ఆరిజన్ తాజాగా ఏడోయాత్రను చేపట్టింది. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన గోపిచంద్ కు అవకాశం దక్కింది. 

న్యూ షెపర్డ్ 25 మిషన్ పేరిట అంతరిక్షంలోకి మనుషులను పంపే ఏర్పాటుచేసింది బ్లూ ఆరిజిన్. ఇందుకోసం మొత్తం ఆరుగురికి ఎంపిక చేయగా అందులో గోపిచంద్ ఒకరు. టెక్సాస్ లోని ప్రయోగ కేంద్రం నుండి యాత్ర ప్రారంభమయ్యింది. 105.7 కిలో మీటర్లు ఎత్తువరకు ఈ యాత్ర సాగింది. పది నిమిషాల్లోనే ఈ అంతరిక్ష యాత్ర ముగించుకుని సురక్షితంగా తిరిగి భూమిపైకి చేరుకున్నారు.  

అంతరిక్షంలో గోపిచంద్ దేశభక్తి : 

విదేశాల్లో స్థిరపడినప్పటికీ గోపిచంద్ తోటకూర మాతృదేశంపై మమకారాన్ని ప్రదర్శించారు. అంతరిక్షంలో భారత మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటుకున్నాడు. ఇలా గోపీచంద్ జాతీయ జెండాను ప్రదర్శిస్తున్న వీడియోను న్యూ ఆరిజిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగు బిడ్డ దేశభక్తికి యావత్ భారత ప్రజలు ఫిదా అవుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Blue Origin (@blueorigin)

 

ఎవరీ గోపిచంద్ : 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందినవాడే గోపిచంద్ తోటకూర. ఇతడు అమెరికాలో ఏరోనాటికల్   డిగ్రీ పూర్తిచేసి అక్కడే జెట్ పైలట్ గా పనిచేసారు. అట్లాంటాలో  ప్రిజర్వ్‌ లైఫ్‌ అనే వెల్‌నెస్‌ సెంటర్‌కు గోపిచంద్ కో ఫౌండర్‌గా ఉన్నారు. 

తన అంతరిక్షయానం గురించి గోపిచంద్ ఆసక్తికర విషయం వెల్లడించారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు తాను అంతరిక్ష యాత్ర గురించి  కుటుంబసభ్యులకు చెప్పలేదని అన్నారు. అయితే బ్లూ ఆరిజిన్ ప్రకటించిన అంతరిక్ష యాత్రికుల పేర్లలో తన పేరు వుండటం చూసి కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారని అన్నారు. అంతరిక్ష ప్రయాణ అనుభూతి ఎంతో గొప్పగా వుందని... ఇది జీవితంలో మరిచిపోలేనిదని గోపిచంద్ అన్నారు. 


 

click me!