జర్మనీలోని ప్రార్థనాలయంలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

Published : Oct 09, 2019, 10:08 PM IST
జర్మనీలోని ప్రార్థనాలయంలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

సారాంశం

జర్మనీలో దారుణమైన సంఘటన జరిగింది. సాయుధులు ప్రార్థనాలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు.

హాల్లే: జర్మనీలో కాల్పులు కలకలం చోటు చేసుకుంది. తూర్పు జర్మనీలో గల హాల్లే నగరంలో తీవ్ర సంఘటన చోటు చేసుకుంది. సాయుధులు ఓ ప్రార్థనాస్థలాన్ని, ఓ కబాబ్ దుకాణాన్ని లక్ష్యం చేసుకుని విధ్వంసానికి దిగారు. 

నగరం మధ్యలో భారీగా కాల్పులకు పాల్పడ్డారు హాల్లేలోని యూదు సామాజిక వర్గం అధిపతి మాక్స్ ప్రివోరోట్జీకీ సంఘటనపై స్పీగెల్ మ్యాగజైన్ తో మాట్లాడారు. సైనిక దుస్తుల్లో గల సాయుధులు మిలిటరీ దుస్తుల్లో వచ్చి ప్రార్థనాలయంలోకి బలవంతంగా చొరబడడానికి ప్రయత్నించారని చెప్పారు 

వారిని భద్రతాధికారులు అడ్డుకున్నారు. ఆ సమయంలో యూదులు యోమ్ కిప్పుర్ ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో సంఘటన జరిగింది. కాల్పుల్లో ఇద్దరు మరణించారు. సంఘటన జరిగిన సమయంలో ప్రార్థనాలయంలో 70 నుంచి 80 మంది దాకా ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !