భారత రచయిత్రి గీతాంజలి శ్రీ నవల ‘రేత్ సమాధి’కి బుకర్ ఫ్రైజ్...

By SumaBala BukkaFirst Published May 27, 2022, 9:26 AM IST
Highlights

భారత రచయిత్రి గీతాంజలి శ్రీ హిందీ నవల ‘రేత్ సమాధి’కి  ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ దక్కింది. 'టోంబ్ ఆఫ్ సాండ్'.. రేత్ సమాధి.. అంటే ఇసుక సమాధి అని అర్థం. 80 ఏళ్ల వృద్ధురాలి కథ.

లండన్ : రచయిత్రి Geetanjali Shree రచించిన హిందీ నవల ‘Tomb of Sand’ ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ Booker Prizeను గెలుచుకుంది. ఈ ఫ్రైజ్ గెలుచుకున్న మొదటి భారతీయ భాష పుస్తకంగా నిలిచింది. గురువారం.. మే 26, 2022న లండన్‌లో జరిగిన ప్రదానోత్సవ వేడుకలో, న్యూ ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీకి ప్రైజ్ అందించారు. గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీషులోకి ట్రాన్స్ లేట్ చేసిన డైకీ రాక్ వెస్ (అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు యాభైవేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను సైతం క్యాష్ ఫ్రైజ్ గా అందించారు. 

'టోంబ్ ఆఫ్ సాండ్', వాస్తవానికి 'రెట్ సమాధి', ఉత్తర భారతదేశంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్ లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం కొత్తగా మారుతుంది. అది ఎలా జరిగింది అనేది నవలా కథ. ఈ కథను బుకర్ న్యాయమూర్తులు "ఆనందకరమైన కాకోఫోనీ", "ఇర్రెసిస్టిబుల్ నవల" అని పిలిచారు. 

“నేను బుకర్ గురించి కలలో కూడా ఊహించలేదు, నేను ఇది సాధించగలనని ఎప్పుడూ అనుకోలేదు. ఇది చాలా పెద్ద గుర్తింపు, ఇది రావడంతో నేను ఆశ్చర్యపోయాను, చాలా సంతోషించాను, గౌరవంగా భావించాను. ఇది వచ్చినందుకు చాలా వినయంగా కూడా ఉన్నాను, ”అని గీతాంజలి శ్రీ అవార్డును స్వీకరించే అంగీకార ప్రసంగంలో అన్నారు.

ఇప్పటివరకు ఆమె ఐదు నవవలు రాయగా, మయి (2000) క్రాస్ వర్డ్ బుక్ అవార్డు 2001కి నామినేట్ అయ్యింది. భారతీయ ప్రముఖ రచయిత ప్రేమ్ చంద్ మీద విమర్శనాత్మక రచన కూడా చేసింది. చిన్నతనంలో పిల్లల పుస్లకాలు ఎక్కువగా ఆంగ్లంలో లేకపోవడంతో తాను హిందీ మీద మక్కువ పెంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్తుంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేట ఘటన ఆధారంగా రాసిన హమారా షహర్ ఉస్ బరాస్ విమర్శలకు ప్రశంసలు అందుకుంది. రాక్ వెల్, రైటర్, ట్రాన్స్ లేటర్ గా మాత్రమే కాదు.. పెయింటర్ గా కూడా పాలపులర్, ఉర్దూ, హిందీ నవలలను రచనలను ఎన్నింటినో ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. 

వాస్తవానికి 2018లో హిందీలో రేత్ సమాధి ప్రచురించబడింది. ‘టూంబ్ ఆఫ్ సాండ్’ ఆమె పుస్తకాలలో యూకే ఇంగ్లీషులోకి తర్జుమా అయ్యింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించింది. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అందులో ‘టాంబ్ ఆఫ్ శాండ్’కు ఈ గౌరవం దక్కింది. బుకర్ ప్రైజ్ వల్ల ఈ పుస్తకం ఇంకా ఎక్కువ మందికి చేరుతుందని రచయిత్రి సంతోషం వ్యక్తం చేసింది. 

బుకర్ ప్రైజ్ పురస్కారం కోసం ఈ నవలకు మరో ఐదు నవలలు గట్టి పోటీని ఇచ్చాయి. 50 లక్షల బహుమతి మొత్తాన్ని రచయిత్రి, అనువాదకురాలు సగం సగం అందుకున్నారు. గీతాంజలి శ్రీ రాసిన ఈ నవలను జ్యూరీ అద్వితీయమైన నవలగా పేర్కొంది. 

click me!