Russia Ukraine War: ఇక‌నైనా రక్తపాతాన్ని ఆపండి : ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

Published : Mar 08, 2022, 11:42 PM IST
Russia Ukraine War: ఇక‌నైనా రక్తపాతాన్ని ఆపండి : ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు

సారాంశం

Russia Ukraine War:  ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చ‌ర్య జ‌రుగుతోంది. నేటీతో..ఈ దాడులు 13వ రోజుకు చేరుకున్నాయి. ఈ త‌రుణంలో ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్  యుద్ధాన్ని ఆపాలని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని విజ్ఞ‌ప్తి చేశారు. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌లు ఇప్పుడూ చ‌ర్చ‌నీయంగా మారాయి.    

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చ‌ర్య జ‌రుగుతోంది. ఈ త‌రుణంలో  ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి  ఆ దేశ మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఓ విజ్ఞప్తి చేశారు. యుద్ధం వ‌ల్ల జ‌రుగుతున్న ర‌క్త‌పాతాన్ని ఆపాలని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని కోరారు. తాను అధ్య‌క్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడాలనుకుంటున్నానని, మరీ ముఖ్యంగా కాస్త తండ్రి మాదిరిగా మాట్లాడాలను కుంటున్నానని తెలిపారు.  2014లో ఉక్రెయిన్ లో  జరిగిన నిరసనల కారణంగా విక్టర్ యనుకోవిచ్ పదవీని కోల్పోయాడు. అప్ప‌టి నుంచి ఆయ‌న రష్యాలో నివసిస్తున్నారు. త‌క్షణ‌మే.. యుద్ధాన్ని ఆపాల‌ని కోరినట్లు ది కైవ్ ఇండిపెండెంట్ నివేదించింది. 

మాజీ అధ్యక్షుడు విక్టర్ యనుకొవిచ్ .. ర‌ష్యా అధ్యక్షుడు తో  ప్రత్యేకంగా భేటీ అయిన‌ట్టు.. ప‌లు గంట‌పాటు.. స‌మావేశ‌మ‌యినట్టు  ప్రావ్దా అనే ఆన్‌లైన్ వార్తాపత్రిక ప‌లు కథ‌నాల‌కు వెల్లువ‌రించిన త‌రుణంలో ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం చ‌ర్చ‌నీయంగా మారాయి. జెలెన్‌‌స్కీకి చాలా మంది సలహాదారులు ఉన్నారని, అయితే రక్తపాతాన్ని ఆపవలసిన బాధ్యత వ్యక్తిగతంగా ఆయనపైనే ఉందని తెలిపారు. శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవలసిన బాధ్యత ఆయనదేనని చెప్పారు. దీని కోసం ఉక్రెయిన్, రష్యా, డోన్‌బాస్ ఎదురు చూస్తున్నాయన్నారు. శాంతి ఒప్పందం కుదుర్చుకుంటే జెలెన్‌స్కీకి ఉక్రెయిన్ ప్రజలు, పాశ్చాత్య దేశాల్లోని మిత్రులు కృతజ్ఞులుగా ఉంటారన్నారు. 

ఇదిలా ఉంటే.. మూడో విడ‌త చ‌ర్చ‌లు విఫ‌లం అయిన త‌రువాత‌.. వోలోడిమిర్ జెలెన్స్కీ కార్యాలయ అధిపతి సలహాదారు మైఖైలో పోడోల్యాక్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఇలా రాసుకోచ్చారు.  మూడవ రౌండ్ చర్చలు ముగిశాయి. మానవతా కారిడార్ల ఏర్పాటుకు ఇరుదేశాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయి. ఇదే ఈ చర్చ‌ల్లో  సానుకూల ఉపశమనం అని అన్నారు. “ఉక్రెయిన్ ఆధునిక నాగరికత గ‌ల‌ దేశం.. స్వేచ్చ యుత వాతావ‌ర‌ణం ఉంది .కానీ ప్ర‌స్తుతం ఉక్రెయిన్ లో మానవతావాదం ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.  

మ‌రోవైపు.. ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఓలెక్సీ రెజ్నికోవ్.. రష్యా దాడుల వల్ల‌..  దాదాపు 400 మంది సాధారణ ప్రజలు మరణించినట్లు, సుమారు 800 మంది గాయపడినట్లు తెలిపారు. ఇది కేవ‌లం అంచనా మాత్రమేనని, పూర్తి వివరాలు వెలువ‌డాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని  ఉందని చెప్పారు. రష్యా దళాల బాంబు దాడుల్లో సుమారు 200 పాఠశాలలు, 34 ఆసుపత్రులు, 1,500 నివాస భవనాలు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. రష్యాపై పాశ్చాత్య దేశాలు కఠినమైన ఆంక్షలను విధిస్తున్నాయి. 

ఏదిఏమైనా.. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకుని..  అధ్యక్షుడు జెలెన్ స్కీని గద్దె దించివేయాల‌ని ర‌ష్యా భావిస్తుంది. ఆ త‌రువాత‌.. తనకు నమ్మకంగా.. త‌మ చెప్పు చేత‌ల్లో ఉండే  వ్యక్తిని అధ్యక్షుడి పీఠం మీద కుర్చోబెట్టాలని వ్లాదిమిర్ పుతిన్ స్కెచ్ వేశాడని అంతర్జాతీయ మీడియా అంటోంది. ఈ త‌రుణంలో 
ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యసుకోవిచ్ పేరు తెర మీదకు వచ్చింది. గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా విక్టర్ యనుకోవిచ్ ఎన్నికైన సమయంలో ఆ దేశంలో హింసాత్మక నిరసనలు వెల్లువెత్తడంతో రష్యాకు పారిపోయాడు. అందుకే ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు విక్టర్ యసుకోవిచ్  తాజా వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయంగా మారాయి.  

PREV
click me!

Recommended Stories

Bangladesh Unrest: బంగ్లాదేశ్‌లో ఏం జ‌రుగుతోంది.? అస‌లు ఎవ‌రీ దీపు.? భార‌త్‌పై ప్ర‌భావం ఏంటి
Alcohol: ప్ర‌పంచంలో ఆల్క‌హాల్ ఎక్కువగా తాగే దేశం ఏదో తెలుసా.? భారత్ స్థానం ఏంటంటే