ఇమ్రాన్ ఖాన్ తొలగించిన అధికారికి పాక్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు.. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆయన ప్రత్యేకతేంటీ ?

By Rajesh KarampooriFirst Published Nov 24, 2022, 8:17 PM IST
Highlights

పలు ఊహాగానాలు , వివాదాల నడుమ  లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ పాకిస్తాన్ తదుపరి ఆర్మీ చీఫ్‌గా ఎంపికయ్యారు.లెఫ్టినెంట్ జనరల్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన పదవిని నిస్సందేహంగా నిర్వహిస్తారు. ఆయన  నవంబర్ 29న పదవీవిరమణ చేస్తున్న జనరల్ కమర్ జావేద్ బజ్వా  స్థానంలో పదవీ బాధత్యలు చేపట్టనున్నారు. జనరల్ బజ్వా .. ఆర్మీ చీఫ్‌గా ఆరేండ్లు సేవలందించారు.  

పాకిస్థాన్ కొత్త ఆర్మీ చీఫ్: పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా సయ్యద్ అసిమ్ మునీర్ ను నియమిస్తున్నట్లు ప్రధాని షాబాజ్ షరీఫ్ ప్రకటించారు. విశేషమేమిటంటే..2019లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తొలగించిన అసిమ్ మునీర్ ఇతడే..ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ స్ట్రీట్‌ పెర్ఫామెన్స్‌ మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. నూతన  ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను నియమిస్తూ ప్రధాని షాబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారని గురువారం పాక్ సమాచార, ప్రసార శాఖ మంత్రి మర్యమ్ ఔరంగజేబ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను నియమించాలని నిర్ణయించారు.

ఇమ్రాన్ ఖాన్‌తో వివాదాలు

అసిమ్ మునీర్ ప్రస్తుతం పాకిస్థాన్ ఆర్మీ క్వార్టర్ మాస్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. దీనికి ముందు..అతను గుజ్రాన్‌వాలాలో ఉన్న పాకిస్తాన్ సైన్యం  30వ కార్ప్స్‌కి కమాండర్‌గా వ్యవహరించారు.
అయితే జూన్ 2019లో అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ .. ఆసిమ్ మునీర్ ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. దీంతో ఒక సారిగా  వెలుగులోకి వచ్చారు. అయితే.. ఇమ్రాన్‌ఖాన్‌తో సంబంధాలు సరిగా లేకపోవడం వల్లే అతడిని పదవి నుంచి తొలగించారని భావించారు. ఈ నెల 29న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా స్థానంలో మునీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. జనరల్ బజ్వా ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.

మునీర్‌ ఐఎస్‌ఐ చీఫ్‌

2019 ఫిబ్రవరిలో మునీర్ ఐఎస్‌ఐ చీఫ్‌గా ఉన్న సమయంలో భారత్ పాకిస్థాన్‌లోని బాలాకోట్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటన తరువాత అసిమ్ మునీర్,  ఇమ్రాన్ ఖాన్‌కు విభేదాలు తల్లెత్తాయని భావిస్తారు. దీంతో అతడిని పదవి నుంచి తొలగించారు. సైన్యం విషయంలో రాజకీయాలు చేయడంతో  ఇమ్రాన్ ఖాన్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మునీర్ ఆర్మీ చీఫ్‌గా వస్తే ఇమ్రాన్ ఖాన్ మరింత రెచ్చిపోవచ్చు. అయితే ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలపై ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా వివరణ ఇచ్చారు. పాకిస్థాన్‌లో సైన్యం, ఇమ్రాన్‌ఖాన్‌ల మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడేలా కనిపించడం లేదు. అటువంటి పరిస్థితిలో.. ఇమ్రాన్ ఖాన్ త్వరలో రావల్పిండి యాత్రను మరోసారి ప్రారంభించవచ్చు.

 ఆర్మీ చీఫ్‌కి రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి
 

అసిమ్ మునీర్ నియామకానికి సంబంధించి మరో సందేహం ఉంది . రాష్ట్రపతి అతని పేరును ఆమోదించాలి. వాస్తవానికి ప్రస్తుత పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఇమ్రాన్ ఖాన్‌కు సన్నిహితంగా భావిస్తారు.  ఆర్మీ చీఫ్‌గా అసిమ్ మునీర్‌ను నియమించడానికి షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం రాష్ట్రపతి నుండి గ్రీన్ సిగ్నల్ పొందవలసి ఉంది. ఇది జరగకపోతే పాకిస్తాన్‌లో రాజ్యాంగ సంక్షోభంతోపాటు సైనిక , రాజకీయాలలో ప్రకంపాలను సంభవించవచ్చు.


సయ్యద్ అసిమ్ మునీర్  ప్రత్యేకత.. 

లెఫ్టినెంట్ జనరల్ మునీర్ పాకిస్తాన్ యొక్క 17వ ఆర్మీ చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఆయన మంగ్లాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. అనంతరం..  ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్ లోని 23వ బెటాలియన్‌కు ఎంపికయ్యారు.. 1986 లో తన సైనిక వృత్తిని ప్రారంభించాడు.2018 సెప్టెంబరు లో  లెఫ్టినెంట్ జనరల్ మునీర్ త్రీ స్టార్ జనరల్ స్థాయికి పదోన్నతి పొందారు.వాస్తవానికి లెఫ్టినెంట్ జనరల్‌గా ఆయన నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27తో ముగుస్తుంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ జనరల్ మునీర్ రావల్పిండిలోని GHQలో క్వార్టర్ మాస్టర్ జనరల్‌గా సేవలందిస్తున్నారు. అన్ని సైనిక విభాగాలకు సరఫరాలను పర్యవేక్షించే బాధ్యతలను నిర్వహిస్తున్నాడు.  

అంతకు ముందు.. 2017 ప్రారంభంలో.. అతడు మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్‌గా నియమితుడయ్యాడు. దాదాపు 21 నెలల పాటు ఆ పదవిలో విధులు నిర్వహించారు. 2018 అక్టోబర్ లో పాక్ లోని ప్రధాన గూఢచార సంస్థ అయిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) చీఫ్‌గా నియమితులయ్యారు. ఐఎస్‌ఐ చీఫ్‌గా కేవలం ఎనిమిది నెలలు మాత్రమే పనిచేశారు. అనంతరం ఆ పదవి నుంచి అతడిని తొలగించారు. ఫిబ్రవరి 2019లో పుల్వామా దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించిన సమయం ఇది. భారతదేశం , పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థన మేరకు బజ్వా అతన్ని ఐఎస్‌ఐ చీఫ్ పదవి నుండి తొలగించారని నివేదికలు చెబుతున్నాయి. అతని స్థానంలో  లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమించారు. ఫైజ్ హమీద్‌ .. అప్పటి ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడని పేర్కోంటారు. లెఫ్టినెంట్ జనరల్ మునీర్ కూడా రెండేళ్లపాటు గుజ్రాన్‌వాలా కార్ప్స్ కమాండర్‌గా నియమితులయ్యారు.అక్కడి నుండి అతడిని రావల్పిండిలో ప్రస్తుతం ఉన్న పోస్టింగ్‌కి తరలించబడ్డాడు. 2018 మార్చిలో సయ్యద్ అసిమ్ మునీర్  స్వోర్డ్ ఆఫ్ హానర్ హోల్డర్ ,  హిలాల్-ఇ-ఇమ్తియాజ్ అవార్డును అందుకున్నాడు.

click me!