క్యాన్సర్ రోగిపై దగ్గిన మహిళ.. జైలు శిక్ష

By telugu news teamFirst Published Apr 10, 2021, 12:34 PM IST
Highlights

క్యాన్సర్ తో బాధపుడుతున్న ఓ మహిళ పై దగ్గిన కారణంగా మరో మహిళకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించారు. 

కరోనా మహమ్మారి తీవ్రరూపం దాలుస్తున్న వేళ.. దానిని అరికట్టేందుకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కోవిడ్ నియమాలు పాటించనివారికి శిక్షలు విధించడానికి కూడా వెనకాడటం లేదు. ఈ కరోనా నేపథ్యంలోనే.. క్యాన్సర్ తో బాధపుడుతున్న ఓ మహిళ పై దగ్గిన కారణంగా మరో మహిళకు నెల రోజులపాటు జైలు శిక్ష విధించారు. ఈ సంఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గతేడాది జూన్‌లో ఫ్లోరిడాలోని జాక్సన్‌విల్లేలో గల పీర్ 1 స్టోర్‌కు వెళ్లిన డెబ్రా హంటర్ అనే మహిళ ఈ నిర్వాకానికి పాల్పడింది. స్టోర్‌కు వచ్చిన ఓ క్యాన్సర్ రోగిపై హంటర్ కావాలని దగ్గడం చేసింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న ఆ సమయంలో హంటర్ ఇలా చేయడంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో, పొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో హంటర్‌ను జూన్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె ఒకరోజు జైలులో కూడా ఉంది. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైంది. తాజాగా ఈ కేసు జాక్సన్‌విల్లే కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో దోషిగా తేలిన హంటర్‌కు న్యాయస్థానం నెల రోజుల జైలు శిక్ష, 500 డాలర్ల(రూ.37వేలు) జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.   

click me!