హ్యాట్సాఫ్ : ఎనిమిదినెలల గర్భంతో తైక్వాండోలో గోల్డ్ మెడల్

By AN TeluguFirst Published Apr 9, 2021, 7:26 PM IST
Highlights

క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న నేటి తరుణంలో నైజీరియాకు చెందిన అమినాత్ ఇద్రీస్ అనే 26యేళ్ల అద్లెట్ ఎనిమిది నెలల గర్భంతో ఉండి కూడా తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించింది. 

క్రీడల్లో మహిళల ప్రాతినిధ్యం తగ్గుతూ వస్తున్న నేటి తరుణంలో నైజీరియాకు చెందిన అమినాత్ ఇద్రీస్ అనే 26యేళ్ల అద్లెట్ ఎనిమిది నెలల గర్భంతో ఉండి కూడా తైక్వాండో పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి సంచలనం సృష్టించింది. 

ప్రస్తుతం ఆమె పేరు సోషల్ మీడియాలో మార్మోగి పోతోంది. నైజీరియాలో జరిగిన నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ పోటీల్లో భాగంగా తైక్వాండో విక్స్ డ్ పూమ్సే కేటగిరీలో ఆమె ఈ పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. దీంతో పాటు ఆమె ఇతర కేటగిరీల్లో సైతం అనేక పతకాలు సాధించి ఔరా అనిపించింది. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భం దాల్చడానికి ముందు నుంచే తాను శిక్షణ తీసుకుంటాన్నానని.. అందువల్లే గర్భంతో ఉండి కూడా పోటీల్లో పాల్గొనడం సమస్యగా అనిపించలేదని పేర్కొంది. 

ఇద్రీస్ సాధించిన ఘనతకు సంబంధించిన వీడియోను నేషనల్ స్పోర్ట్స్ ఫెస్టివల్ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారింది. ఎనిమిది నెలల గర్భిణి బంగారు పతకం సాధించి, స్పూర్తి దాయకంగా నిలిచిందని క్యాప్షన్ జోడించింది. 

ఈ వీడియోకు విపరీతమైన రెస్పాన్స్ రావడంతో నెటిజన్లు ఆమె మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మగువా నీకు సలామ్ అంటూ తెగ ట్రోల్‌ చేస్తున్నారు.
 

click me!