
ఇస్లామాబాద్: Pakistan లోని కరాచీలో మంగళవారం నాడు Blast చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టుగా స్థానిక మీడియా ప్రకటించింది. పలువురు ఈ ఘటనలో గాయపడ్డారని తెలుస్తుంది. సంఘటన స్థలంలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు.
మస్కాన్ చౌరంగి సమీపంలోని వ్యాన్ లో సిలిండర్ పేలిందని రెస్క్యూ సర్వీసెస్ సంస్థ తెలిపింది. అయితే పేలుడు జరిగిన తీరుపై పోలీసులు ఇంకా స్పందించలేదు.Sindh సీఎం Murad Ali Shah ఈ ఘటనపై ఆరా తీశారు. సంఘటన స్థలానికి చేరుకోవాలని ఉగ్రవాద నిరోధక శాఖ, ఎస్ఎస్‌పీని ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని డౌ యూనివర్శిటీ ఆసుపత్రికి తరలించారు.అంతేకాదు నివేదికను కూడా సమర్పించాలని కూడా కరాచీ కమిషనర్ ను ఆదేశించారు.
పేలుడు తర్వాత రేంజర్లు, పోలీసులు సంఘటన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకొన్నారు.కరాచీ యూనివర్శిటీలోని కన్సూషియస్ డిపార్ట్ మెంట్ వెలుపల జరిగింది.కన్సూషియన్ ఇనిస్టిట్యూట్ వెలుపల కారులో ఈ పేలుడు చోటు చేసుకోవడంతో ఇద్దరు చైనాకు చెందిన ఉపాధ్యాయులతో పాటు మరో ముగ్గురు మరణించినట్టుగా స్థానిక మీడియా చెబుతుంది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. చైనాకు చెందిన ఉపాధ్యాయులు వ్యాన్ లో డిపార్ట్ మెంట్ వైపు వెళ్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు. రెండు మోటార్ బైక్ లపై వెళ్తున్న రేంజర్ సిబ్బంది వ్యాన్ కు ఎస్కార్ట్ గా కూడా ఉన్నారు.
పేలుడు ఘటనకు సంబంధించి కచ్చితమైన సమాచారం లేదని ఈస్ట్ డీఐజీ ముఖద్దాస్ హైదర్ మీడియాకు చెప్పారు. బాంబ్ డిస్పోజల్ టీమ్ ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తుందని ఆయన చెప్పారు.