కుప్పకూలిన హెలికాప్టర్: ఐదుగురు దుర్మరణం

Published : Mar 29, 2021, 07:53 AM IST
కుప్పకూలిన హెలికాప్టర్: ఐదుగురు దుర్మరణం

సారాంశం

అమెరికాలోని అలస్కాలో ఓ హెలికాప్టర్ గ్లేషియర్ ను ఢీకొట్టి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఐదురుగు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు.

అలస్కా: అమెరికాలోని అలస్కాలో హెలికాప్టర్ కుప్ప కూలింది. యాంకరేజ్ నగరానికి సమీపంలో గల క్నిక్ గ్లేషియర్ ను హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని అలస్కా స్టేట్ ట్రూపర్స్ ప్రతినిధి ఆస్టిన్ డేనియల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 

యాంకరేజ్ సమీపంలో గల క్నిక్ గ్లేషియర్ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం జరిగిన స్థలంలో తనిఖీలు నిర్వహిచారు. పైలట్ సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరమించినట్లు గుర్తించామని డేనియల్ తెలిపారు. ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడని, ఆస్పత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 

అలస్కా ఆర్మీ నేషనల్ గార్డ్స్, మౌంటెయిన్ రెస్క్యూ బృందాల సహకారంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విమాన రాకపోకలపై ఫెడరల్ ఏవియేషన్ తాత్కాలికంగా ఆంక్షలు విధించింది. జాతీయ రవాణా భద్రతా మండలి అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ఇక్క‌డ ఎన్ని అణు బాంబులు ప‌డ్డా ఏం కాదు.. ప్ర‌పంచంలో అత్యంత భ‌ద్ర‌మైన దేశం ఏదో తెలుసా?
Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్