హమ్మయ్య.. కాస్తలో కాస్త బెటర్: ఎన్నో ప్రయత్నాలతో కదిలిన భారీ నౌక

By Siva KodatiFirst Published Mar 28, 2021, 2:36 PM IST
Highlights

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జల మార్గం సూయజ్ కెనాల్‌లో భారీ నౌక చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని కదిలించి, ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు సూయజ్ కాలువ అథారిటీ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జల మార్గం సూయజ్ కెనాల్‌లో భారీ నౌక చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిని కదిలించి, ఆ మార్గాన్ని క్లియర్ చేసేందుకు సూయజ్ కాలువ అథారిటీ నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఈ క్రమంలో కాస్త పురోగతి కనిపించినట్లుగా తెలుస్తోంది. నౌక కొద్దిగా కదిలినట్లు అధికారులు ప్రకటించారు. ఈ మానవ నిర్మిత కాలువలో ఆరు రోజుల నుంచి చిక్కుకున్న ఎవర్ గివెన్ నౌక మళ్లీ తన ప్రయాణం ఎప్పుడు ప్రారంభిస్తుందో మాత్రం అధికారులు చెప్పలేకపోతున్నారు.  

అయితే ఎవర్ గివెన్ నౌకను ప్రయాణానికి అనువుగా తిప్పేందుకు చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని అథారిటీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఇసుకను తవ్వడం, టగ్‌బోట్స్‌తో లాగడం వంటి చర్యల ద్వారా శనివారం కదలిక తీసుకొచ్చినట్లు చెపే్పారు. ఆ సమయంలో సుమారు 30 డిగ్రీల మేరకు కదిలిందని పేర్కొన్నారు. 

సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రేబీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ఈ భారీ నౌక క్రింద నీటి ప్రవాహం మొదలైందని చెప్పారు. త్వరలోనే ఈ నౌక పూర్తిగా కదులుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించే నౌకల్లో 15 శాతం నౌకలు సూయజ్ కాలువ గుండానే ప్రయాణిస్తాయి. ఈ నేపథ్యంలో నాలుగు ఫుట్‌బాల్ మైదానాల కన్నా పొడవైన ఎంవీ ఎవర్ గివెన్ నౌక మంగళవారం నుంచి ఈ కాలువలో చిక్కుకుంది. దీంతో దానికి ఇరు పక్కలా భారీగా నౌకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాటికి ఈ నౌక చుట్టూ ఉన్న ఇసుకలో 20 వేల టన్నుల ఇసుకను తొలగించారు. 
 

click me!