Kamala Harris - US election 2024 : అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష రేసులో ఉన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆమె తలపడనున్నారు. అయితే, వరుసగా ఆమెపై జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రచారాల్లో కాల్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయ నేపథ్యం ఉన్నందుకేనా ఈ దాడులు?
Kamala Harris - US election 2024 : ఫీనిక్స్ సబర్బ్‌లోని కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరిగాయి. దీని వల్ల పెద్ద నష్టం కూడా జరిగింది. అయితే, అదృష్టం కొద్ది ఎవరికీ గాయాలు కాలేదు. ఈ ఘటనపై టెంపె పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది సెప్టెంబరు 16న జరిగిన ఇలాంటి సంఘటనను మరోసారి గుర్తుచేసింది. ఓప్రా విన్‌ఫ్రేతో జరిగిన ఫోరమ్‌లో హారిస్ తుపాకుల వినియోగం గురించి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, కమలా హరీస్ పై ఇలా దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపుతున్న అంశంగా మారింది. ప్రధానంగా కమళా హారీస్ భారతీయ నేపథ్యం చర్చకు వస్తోంది.
ఫీనిక్స్ సబర్బ్‌లోని కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై తుపాకీ కాల్పులు జరిగిన సమయంలో డెమోక్రటిక్ పార్టీ కార్యాలయంలో ఎవరూ లేనందున ప్రాణనష్టం జరగలేదు. అయితే, అధికారులు దీనిని ఆస్తి నేరంగా పరిగణించి కేసు నమదుచేశారు. అరిజోనా రిపబ్లిక్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 16న అదే కార్యాలయంలో పెల్లెట్ (బీబీ గన్) నుంచి పలు రౌండ్లు కాల్పులు ఇదే విధంగా జరిగాయి. స్థానిక మీడియా నివేదికల ప్రకారంఆ కార్యాలయం తలుపులు, కిటికీలకు బుల్లెట్ రంధ్రాలు పడ్డాయి. లోపల కూడా ఫర్నీచర్ ధ్వంసమైందని సమాచారం.
undefined
ట్రంప్ పై కాల్పుల మాదరిగానే..
అరిజోనాలోని యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పుల ఘటన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, టెంపేలోని డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయం సోమవారం అర్ధరాత్రి తర్వాత అనేక బుల్లెట్ దాడులను చూసింది.
"రాత్రిపూట కార్యాలయంలో ఎవరూ లేరు, అయితే ఇది ఆ భవనంలో పనిచేసే వారితో పాటు సమీపంలోని వారి భద్రత గురించి ఆందోళన కలిగిస్తుంది" అని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సార్జెంట్ ర్యాన్ కుక్ తెలిపారు. డిటెక్టివ్‌లు ప్రస్తుతం సంఘటనా స్థలంలో సేకరించిన సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సిబ్బంది, ఇతరులకు భద్రతను పెంచడానికి అదనపు చర్యలు తీసుకున్నారు.
భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి
ఈ దాడి భవనంలో, దాని చుట్టుపక్కల పనిచేసే వ్యక్తుల భద్రత గురించి ఆందోళనలకు దారితీసింది. ప్రతి ఒక్కరికీ రక్షణ కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. డిటెక్టివ్‌లు సైట్ నుండి ఆధారాలను పరిశీలిస్తున్నందున దర్యాప్తు కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఈ సంఘటన యునైటెడ్ స్టేట్స్‌లోని రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్న భయంకరమైన సంఘటనల వరుస దాడులపై కొత్త చర్చకు తెరలేపింది. వారం రోజుల క్రితం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరో ప్రయత్నం జరిగింది. ఈ సంఘటనలు రాజకీయ హింసపై పెరుగుతున్న ఆందోళనలను హైలైట్ చేస్తున్నాయి.
ఈ ఘటనపై కమలా హారిస్ ఏమన్నారు?
తమ ప్రచార కార్యలయంపై కాల్పుల గురించి కమలా హారిస్ ఎటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేయనప్పటికీ ఆమె అధికారిక వర్గాలు పలు ప్రకటనలు చేశాయి. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపారు. "ఘటన స్థలానికి త్వరగా వచ్చినందుకు మేము టెంపే పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. ఆస్తి నష్టం జరిగింది" అని అరిజోనా డెమోక్రటిక్ పార్టీ సమన్వయ ప్రచార నిర్వాహకుడు సీన్ మెక్‌ఎనర్నీ అన్నారు.
అరిజోనా డెమోక్రటిక్ పార్టీ చైర్‌వుమన్ యోలాండా బెజరానో మాట్లాడుతూ.. "అరిజోనా డెమొక్రాటిక్ పార్టీ హింసకు గురి కావడం చాలా విచారకరం. ఇది చేసింది అరిజోనాన్లు లేదా అమెరికన్లు కాదు" అని అన్నారు. సెప్టెంబర్ 15న తన వెస్ట్ పామ్ బీచ్ గోల్ఫ్ కోర్స్‌లో ట్రంప్‌పై రెండవ హత్యాయత్నం జరిగిన వారం తర్వాత ఈ ఘటన జరగడం ఆందోళనను పెంచిందన్నారు.
తుపాకుల వాడకం ఆందోళన కలిగిస్తోంది.. కమలా హారీస్
తుపాకులు, ఇలాంటి దాడులకు ఉపయోగించే ఆయుధాలను నిషేధించాలని కమలా హారిస్ పిలుపునిచ్చారు. హారిస్ చివరిసారిగా ఆగష్టు ప్రారంభంలో అరిజోనాలో ప్రచారం చేశారు. అయితే ఆమె ప్రచారం టెంపేలో తుపాకీ నియంత్రణ న్యాయవాది మాక్స్‌వెల్ ఫ్రాస్ట్ (D-Fla.)తో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రచార ర్యాలీలో హారిస్ తుఫాకులు, సంబంధిత ఆయుధాలను నిషేధించాలనీ, రాష్ట్రాలు కూడా వీటిపై చట్టాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో తుపాకీ హింస అంటువ్యాధిని మనం అంతం చేయాలని అన్నారు.
భారతీయ నేపథ్యంతో కమలా హారీస్ పై దాడులు జరుగుతున్నాయా?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న కమలా హరీస్ భారతీయ నేపథ్యం కలిగి ఉన్నారు. ఆమె పై దాడులకు కారణాల్లో ఇది కూడా కనిపించదనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కమలా హరీస్ తన కుటుంబంతో కలిసి భారత సంప్రదాయం ప్రకారం ఇన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆమె పై ఆమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న కార్యకర్త లారా లూమర్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేకెత్తించారు. పరోక్షంగా ఆమె హారీస్ భారతీయ కనెక్షన్ గురించి ప్రస్తావిస్తూ కామెంట్స్ చేశారు. అలాగే, అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ సైతం అక్కడ స్వదేశీ అంశాన్ని లేవనెత్తుతూ కామెంట్స్ చేయడంతో పాటు కమలా హరీస్ ను భారతీయ మూలాలను కూడా ప్రస్తావించిన పరిస్థితులు కనిపించాయి.
కమలా హరీస్-భారత్ కు కనెక్షన్ ఏమిటి?
యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ జూలై 21న 2024 ప్రెసిడెంట్ రేసు నుండి వైదొలిగారు. దీంతో డెమొక్రాటిక్ అభ్యర్థిగా తన డిప్యూటీ కమలా హారిస్ ఎంపిక అయ్యారు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తో తలపడుతున్నారు. 2020లో కమలా హారిస్ యూఎస్ మొదటి భారతీయ-అమెరికన్, మొదటి ఆఫ్రికన్-అమెరికన్ మహిళ వైస్-ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 2024 లో అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగారు.
కమలా హారిస్ తమిళనాడుకు చెందిన కుటుంబ నేపథ్యం కలిగి ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లి అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె శ్యామల గోపాలన్ కుమార్తె. గోపాలన్ హారిస్ క్యాన్సర్ పరిశోధకులు, కాలిఫోర్నియాలో పౌర హక్కుల కార్యకర్త. హారిస్ మామ గోపాలన్ బాలచంద్రన్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ (IDSA)లో మాజీ కన్సల్టెంట్, ఢిల్లీలో ప్రముఖ విద్యావేత్త. ఆమె తాత పివి గోపాలన్ భారతదేశంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థుల పునరావాసంపై పనిచేశారు. జాంబియన్ ప్రెసిడెంట్‌కి సలహాదారుగా కూడా పనిచేశారు. ఆయన భార్య రాజం సామాజిక సేవలో ఖ్యాతిని గడించారు. 2020లో భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్చువల్ ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ హారిస్ తన తల్లికి ఇడ్లీపై ఉన్న ప్రేమ గురించి మాట్లాడారు. ఆమె తన తాతతో కలిసి చెన్నైలో చాలా రోజులు ఉన్నారు. ఇక్కడి స్వాతంత్య్ర పోరాట క్షణాలపై కూడా పలుమార్లు ఆమె మాట్లాడారు.