పాకిస్థాన్ న్యూయర్ వేడుకల్లో కాల్పులు.. 22 మందికి గాయాలు

By team teluguFirst Published Jan 1, 2023, 3:37 PM IST
Highlights

పాకిస్థాన్ లో జరిగిన న్యూయర్ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిషేధం ఉన్నప్పటికీ పలువురు తుపాకీలను ప్రదర్శించి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. 

పాకిస్థాన్ లోని కరాచీ సిటీలో శనివారం రాత్రి నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 22 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో మహిళలు, పిల్లలు ఉన్నారు. శనివారం అర్ధరాత్రి సమయంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భారీ కాల్పుల మోతలు వినిపించాయి.

మీ పద్ధతులు మార్చుకోకుంటే... పోలీసు స్టేషన్‌ను తగులబెడతాం: బీజేపీ ఎమ్మెల్యే

పాకిస్థాన్ టెలివిజన్ నెట్‌వర్క్ జియో టివీ ప్రకారం.. న్యూయర్ వేడుకల్లో తుపాకీలను ప్రదర్శించడం ఆచారంగా వస్తోంది. అయితే దీనిపై కొంత కాలం నుంచి ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ తాజాగా జరిగిన వేడుకల్లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో చిన్న పిల్లలతో పాటు మహిళలకు గాయాలు అయ్యాయి.

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న XBB.1.5 వేరియంట్ భార‌త్ లోనూ గుర్తింపు.. ఎందుకు ఇది ప్రమాద‌క‌ర‌మైంది?

గాయపడిన వారిలో ఎనిమిది మందిని సివిల్ హాస్పిటల్ కు తరలించారు. నలుగురిని జిన్నా హాస్పిటల్ కు, పది మంది మహిళలు, చిన్న పిల్లలను చికిత్స కోసం అబ్బాసీ షాహీద్ హాస్పిటల్ కు తరలించినట్టు అధికారులు తెలిపారు.

బౌద్ధ మత నిర్మూలనకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది: దలైలామా సంచలన ఆరోపణలు

ఈ కాల్పులకు సంబంధించిన ఘటనలో ఇప్పటి వరకు 13 మందిని అరెస్టు చేయగా, వీరిలో ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పెద్ద సంఖ్యలో కరాచీలు వీధులు, రోడ్లపైకి వచ్చారని స్థానిక మీడియా నివేదించింది. దీంతో ఫైవ్ స్టార్ చౌరంగి పండుగ వాతావరణంలో ప్రజలతో కిక్కిరిసిపోయింది. సింధ్ గవర్నర్ కమ్రాన్ టెస్సోరీ కూడా నుమాయిష్ చౌరంగి వద్ద జనాలతో కలిసి బాణాసంచా కాల్చారు. 

click me!