ఇండోనేషియా జైలులో అగ్ని ప్రమాదం: 40 మంది మృతి,73 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Sep 8, 2021, 9:33 AM IST
Highlights

ఇండోనేషియాలోని జైలులో బుధవారం నాడు జరిగిన అగ్ని ప్రమాదంలో 40 మంది ఖైదీలు మరణించారు. మరో  73 మంది స్వల్పంగా గాయపడ్డారు. బాంటెన్ ప్రావిన్స్ లోని జైలులో  అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.


జకార్తా:ఇండోనేషియాలోని ఓ జైలులో బుధవారం నాడు తెల్లవారుజామున సంబవించిన అగ్ని ప్రమాదంలో 40 మంది ఖైదీలు మృతి చెందారు. ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్ లోని ఓ జైలులో కనీసం 40 మంది మరణించారు. పలువురు ఈ ఘటనలో గాయపడ్డారు.

బుధవారం నాడు తెల్లవారుజామున 1 నుండి రెండు గంటల మధ్య జైలులో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ విషయాన్ని గుర్తించిన ఫైరింజన్లు మంటలను ఆర్పినట్టుగా మానవహక్కుల మంత్రిత్వశాఖ జైలు విభాగం ప్రతినిధి రికా అప్రియంతి చెప్పారు.

ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మంటలు వ్యాపించిన గదిలో 122 మంది ఖైదీలున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్టుగా ఆమె తెలిపారు. టాంగెరాంగ్ జైలులో రెండువేల మంది ఖైదీలున్నారు. జైలు సామర్ధ్యం 600 మంది కంటే ఎక్కువ. అయితే ఈ ఘటన చోటు చేసుకొన్న సమయంలో  జైలు సామర్ధ్యం కంటే ఎక్కువగానే ఉన్నారని అధికారులు చెప్పారు.ఈ ఘటనలో సుమారు 73 మంది స్వల్పంగా గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకొందని అధికారులు అనుమానిస్తున్నారు.

 

click me!