అమెరికన్లకు గుడ్‌న్యూస్ : వ్యా‍క్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం.. ట్రంప్ ఉచిత హామీ..

By AN TeluguFirst Published Dec 12, 2020, 11:56 AM IST
Highlights

అత్యధిక కరోనా కేసులతో సతమతమవుతున్న అమెరికాలో వ్యాక్సినేషన్‌ దిశగా తొలి అడుగు పడింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాను అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్-జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

గురువారం 8 గంటల పాటు జరిపిన బహిరంగ చర్చ అనంతరం ఈ ఆమోదం తెలిపింది. వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను 24 గంటల్లో ఇవ్వనున్నారు. కోవిడ్-19 అంతానికి ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. 

దీంతో అగ్రరాజ్యంలో విలయతాండవం చేస్తున్న మహమ్మారికి అడ్డుకట్ట పడినట్లేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక ఫైజర్ టీకాకు ఎఫ్‌డీఏ ఆమోదం లభించింది కనుక 24 గంటల్లోపు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 

అంతేకాదు అమెరికన్లందరికీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.  

సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు. మొదటి టీకాను ఎవరు వినియోగించాలనే విషయాన్ని ఆయా రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయిస్తారని , వయోవృద్ధులకు, ఆరోగ్య కార్యకర్తలు మొదటివరుసలో ఉంటారని చెప్పారు. 

కఠినమైన పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్‌కు అమోదం లభించిందని, 24 గంటల్లోపునే వాక్సినేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని ఆయన వెల్లడించారు.  అంతకు ముందు ఎఫ్‌డీఏకు బయట నుంచి సలహాలు ఇచ్చే నిపుణుల కమిటీ అనుకూలంగా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే.

click me!