లక్షలు తెచ్చిపెట్టిన బాత్రూంలోని అద్దం..

By AN TeluguFirst Published Nov 3, 2020, 3:17 PM IST
Highlights

తమ బాత్రూంలో ఉన్న అద్దం తమకంత అదృష్టం తీసుకొస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. 40యేళ్ల చరిత్ర కలిగిన ఆ అద్ధం వెనకున్న చరిత్ర.. వేలంలో దానికి దక్కిన ధర ఇప్పుడాకుటుంబాన్ని సంతోషంలో ముంచేసింది.

తమ బాత్రూంలో ఉన్న అద్దం తమకంత అదృష్టం తీసుకొస్తుందని వాళ్లు కలలో కూడా ఊహించలేదు. 40యేళ్ల చరిత్ర కలిగిన ఆ అద్ధం వెనకున్న చరిత్ర.. వేలంలో దానికి దక్కిన ధర ఇప్పుడాకుటుంబాన్ని సంతోషంలో ముంచేసింది.

వివరాల్లోకి వెడితే ఫ్రాన్స్ చివరి రాణి మేరీ ఆంటోనిట్టే వాడిన ఓ అద్దం ఎలా వచ్చిందో తెలియదు కానీ  ఓ కుటుంబం దగ్గరికి 40 యేళ్ల క్రితం చేరింది. అది తరతరాలుగా వాళ్లింట్లోనే ఉంది. ఇటీవల ఓ వేలంలో ఈ అద్దం 8వేల పౌండ్లకు అమ్ముడుపోయింది. అంటే అక్షరాలా ఏడు లక్షల డెబ్బైవేల రూపాయలు.

19, 15 అంగుళాల కొలతతో ఉన్న ఈ అద్దం 18వ శతాబ్దానికి చెందిందని వేలం వేసిన తూర్పు బ్రిస్టల్‌ వేలం కంపెనీ గుర్తించింది. దీని చుట్టూ ఉన్న నగిషీలను 19వ శతాబ్దంలో చెక్కినట్లు గుర్తించారు. ఇక ఫ్రేమ్‌లోని వెండి ఫలకం మీద ఈ అద్దం మొదట మేరీ ఆంటోనిట్టే వద్ద ఉండేదని తరువాత దీన్ని మూడవ నెపోలియన్‌ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని రాసి ఉంది. 

మేరీ ఆంటోనిట్టే ఎస్టేట్ నుంచి ఎంప్రెస్‌ యూజీని ఈ అద్దంతో పాటు అనేక వస్తువులను కొనుగోలు చేసిందని సమాచారం. అయితే ఈ అద్దం సదరు కుటుంబానికి వాళ్ల అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందట. ఆ అద్దం విలువ తెలియక వాళ్లు  దాన్ని బాత్రూంలో వేళ్లాడదీశారు. 

ఈస్ట్ బ్రిస్టల్ వేలం ఐడెన్ ఖాన్ మాట్లాడుతూ.. "ఈ అద్దానికి ఎంతో అద్భుతమైన చరిత్ర ఉంది. పద్దెనిమిదవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధ వ్యక్తులు దీన్ని వాడారు..అన్నారు. మేరీ ఆంటోనిట్టే ఫ్రాన్స్ చివరి రాణి. లూయిస్‌ 16ని ని వివాహం చేసుకున్నారు. ఆమె 1774 -1792 మధ్య పాలన సాగించారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ఉరితీయబడ్డారు.
 

click me!