కరోనా నేపథ్యంలో పలు దేశాలు సుదీర్ఘ లాక్ డౌన్ లు విధించాయి. అయితే లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. లేకపోతే రెండోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
జెనీవా: కరోనా నేపథ్యంలో పలు దేశాలు సుదీర్ఘ లాక్ డౌన్ లు విధించాయి. అయితే లాక్ డౌన్ ఆంక్షల్ని సడలిస్తున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. లేకపోతే రెండోసారి కరోనా విజృంభించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండువందల దేశాల్లో కరోనా మహమ్మారి తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికాలో లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు.
undefined
కరోనాను కట్టడి చేసేందుకు కొన్ని దేశాలు లాక్ డౌన్ ను అమలు చేశాయి. కొన్ని దేశాలు లాక్ డౌన్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. సుదీర్ఘ కాలం పాటు లాక్ డౌన్ విధించడంతో ఆయా దేశాల్లో ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం పడుతోంది. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకొంటున్నాయి.
ఈ తరుణంలో డబ్ల్యు హెచ్ ఓ కీలక సూచనలు చేసింది. లాక్ డౌన్ ఎత్తివేసిన దేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. ఈ మేరకు నివేదికలను చూపుతోంది. మరోవైపు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రపంచ దేశాల ప్రశంసలు అందుకొన్న దక్షిణ కొరియాలో నైట్ క్లబ్బులు కరోనా వ్యాప్తి చేసే కేంద్రాలుగా మారిన విషయాన్ని ఆ సంస్థ గుర్తు చేసింది.
also read:బీకేర్ ఫుల్.. చెత్తలో పడేసిన మాస్క్ లు తిరిగి విక్రయం
ఈ సమయంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని డబ్ల్యు హెచ్ ఓ అత్యవసర విభాగం చీఫ్ మైకేల్ ర్యాన్ సూచించారు. ఈ వైరస్ భవిష్యత్తులో ప్రపంచానికి సవాల్ విసిరే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంక్షల సడలింపులో కొన్ని దేశాలు సరిగా వ్యవహరించడం లేదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఆంక్షలను దశలవారీగా సడలించడం సరైందని డబ్లు హెచ్ ఓ డైరెక్టర్ టెడ్రోన్ అథనోమ్ ప్రకటించారు.