బీకేర్ ఫుల్.. చెత్తలో పడేసిన మాస్క్ లు తిరిగి విక్రయం

By telugu news team  |  First Published May 12, 2020, 8:20 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో లాటిన్ అమెరికాతోపాటు మెక్సికో నగరంలో వినియోగించిన మాస్క్‌లను వీధుల్లో విక్రయిస్తున్నారని వెల్లడైంది.


ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం చాలా అవసరం. అంతేకాకుండా.. ఈ వైరస్ ముక్కు, నోరు. కళ్లలోకి తొందరగా ప్రవేశించే అవకాశం ఉన్న కారణంగా.. మాస్క్ లేకుండా బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలో అందరూ మాస్క్ లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ మాస్క్ లకు ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకొని కొందరు మరింత నీచంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది.  ఒకసారి వినియోగించి చెత్తబుట్టల్లో పారేసిన మాస్క్‌లను విక్రయిస్తున్న బాగోతం మెక్సికో సిటీలో వెలుగుచూసింది. 

Latest Videos

undefined

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్థుత విపత్కర పరిస్థితుల్లో లాటిన్ అమెరికాతోపాటు మెక్సికో నగరంలో వినియోగించిన మాస్క్‌లను వీధుల్లో విక్రయిస్తున్నారని వెల్లడైంది. చెత్తబుట్టల్లో పారేసిన సర్జికల్ ఫేస్ మాస్క్‌లను తిరిగి విక్రయిస్తున్నారని అందిన సమాచారంతో మెక్సికన్ ఫార్మసీ యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు.

పలు దేశాల్లో కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఫేస్ మాస్క్‌లకు కొరత ఏర్పడటంతో పాటు వీటి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దీంతో లైసెన్స్ లేని వ్యాపారులు వీధుల్లోనూ వాడి పడేసిన మాస్క్ లను తిరిగి విక్రయిస్తున్నారని ఫార్మసీ యజమానులే చెబుతున్నారు. 

కరోనా ప్రబతున్న దృష్ట్యా వినియోగించిన మాస్క్ లను వినియోగించడం చాలా ప్రమాదకరమని వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని మెక్సికో ఫార్మసీ యజమానులు చెపుతున్నారు. ప్రజలు వాడిన మాస్క్ లను ముక్కలుగా చేసి చెత్తబుట్టల్లో పారేయాలని మెక్సికో ఫార్మసీ యజమానులు కోరారు.దీనికితోడు వాడేసిన శానిటైజర్ ఖాళీ బాటిళ్లలో నకిలీ శానిటైజర్లు పోసి విక్రయిస్తుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

click me!