చైనాలో మళ్లీ కరోనా కలకలం... వుహాన్ లో 6 కొత్త కేసులు

By telugu news teamFirst Published May 12, 2020, 7:31 AM IST
Highlights

అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్‌ చేసింది. ఛాన్‌గోయింగ్‌ స్ట్రీట్‌ వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి  ఝాంగ్‌ యుక్సిన్‌ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్‌ చేసినట్లు షిన్‌హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. 


కరోనా మహమ్మారి చైనాలో మళ్లీ తిరగపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ మహమ్మారి చైనాలో పుట్టిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచే ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలకు పాకేసింది. అయితే.. చైనాలో మాత్రం తగ్గుముఖం పట్టిందని అందరూ అనుకున్నారు. అయితే... అది మళ్లీ తిరగపెట్టడం గమనార్హం.

చైనాలోని వుహాన్ లో కరోనా కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు చెప్పారు. వూహాన్‌లోని సాన్‌మిన్‌ నివాస సముదాయంలో ఈ కొత్త కేసులు నమోదు కాగా.... అధికారి కమ్యూనిస్టు పార్టీ ఒక అధికారిని సస్పెండ్‌ చేసింది. ఛాన్‌గోయింగ్‌ స్ట్రీట్‌ వర్కింగ్‌ కమిటీ కార్యదర్శి  ఝాంగ్‌ యుక్సిన్‌ వ్యాధి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పార్టీ సస్పెండ్‌ చేసినట్లు షిన్‌హువా వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది. 

కొత్తగా బయటపడ్డ కేసులన్నీ ఈ ఛాంగ్‌గోయింగ్‌ వీధిలోనివే. మరోవైపు, చైనాలోని అన్ని ప్రాంతాల్లోనూ వైరస్‌ ప్రభావం తగ్గిందనేందుకు సూచనగా ప్రభుత్వం కోవిడ్‌ రిస్క్‌ ప్రమాద హెచ్చరికను తగ్గించింది. వ్యాపారాలు, ఫ్యాక్టరీలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ప్రఖ్యాత షాంఘై డిస్నీల్యాండ్‌ మళ్లీ మొదలైంది

click me!