మోడల్ కి చేదు అనుభవం.. పొట్టి డ్రెస్ వేసుకుందని..

Published : Feb 06, 2021, 02:39 PM IST
మోడల్ కి  చేదు అనుభవం.. పొట్టి డ్రెస్ వేసుకుందని..

సారాంశం

ఆమె వేసుకున్న టాప్‌ మరీ చిన్నదిగా ఉండటంతో సిబ్బంది ఆమెను  విమానం ఎక్కనివ్వలేదు. ఆ సమయంలో మోడల్‌ బ్లూ జీన్స్, బ్లాక్‌ క్రాప్ టాప్ ధరించి ఉంది. 

పొట్టి దుస్తులు ధరించిన కారణంగా ఓ మోడల్ కి చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్ పొట్టిగా ఉందని ఆమెను కనీసం విమానం ఎక్కనివ్వలేదు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. కాగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్‌స్టాగ్రామ్ మోడల్  జెట్‌స్టార్‌ అనే ఎయిర్‌లైన్స్‌లో గోల్డ్ కోస్ట్ నుంచి మెల్‌బోర్న్‌కు బయలుదేరింది. అయితే ఆమె వేసుకున్న టాప్‌ మరీ చిన్నదిగా ఉండటంతో సిబ్బంది ఆమెను  విమానం ఎక్కనివ్వలేదు. ఆ సమయంలో మోడల్‌ బ్లూ జీన్స్, బ్లాక్‌ క్రాప్ టాప్ ధరించి ఉంది. 

అయితే టాప్‌ మరీ చిన్నదిగా ఉందని, ఓవర్‌ కోట్‌ ధరించాలని సూచించారు. లేదంటే విమానంలోకి అనుమతించమని సిబ్బంది తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీ లేక జాకెట్‌ను ధరించింది. ఈ విషయంపై తన  ఫేస్‌బుక్‌ పేజీలో ఆవేదనను వ్యక్తం చేసింది.   

'నేను విమానంలోకి అడుగుపెట్టగానే, అక్కడి సిబ్బంది ఏదో వెతకడం​ ప్రారంభించాడు. నా డ్రెస్‌ చూసి నన్ను జాకెట్‌ వేసుకోమని చెప్పినప్పుడు చలిగా ఉంటుందని అలా అన్నారేమో అనుకున్నా. కానీ నా టాప్‌ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలోకి ఎక్కించలేదమని చెప్పిన్పపుడు చాలా బాధేసింది. జాకెట్‌ వేసుకునేంత వరకు సీట్లోకి కూర్చోనివ్వలేదు. నేను ఒక మోడల్‌ని. అంత మంది ప్రయాణికుల ముందు నన్ను అవమానించారు. నాపై వివక్ష చూపించారు. జెట్ స్టార్ ఆస్ట్రేలియా..ఇది 1921 ఆ లే​క 2021' ?అని ఆమె ఆవేదన చెందడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Putin walking style: పుతిన్ న‌డిచేప్పుడు కుడి చేయి ఎందుకు కదలదు.? ఏదైనా స‌మ‌స్యా లేక..