కాబూల్‌ : మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం జరిగే ఛాన్స్..?

Siva Kodati |  
Published : Oct 05, 2022, 05:16 PM IST
కాబూల్‌ : మసీదులో భారీ పేలుడు.. భారీగా ప్రాణనష్టం జరిగే ఛాన్స్..?

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. 

ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదులో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో భారీగా ప్రాణనష్టం సంభవించినట్లుగా తెలుస్తోంది. రాజధానిలో అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో పేలుడు జరిగినట్లుగా సమాచారం. పేలుడు సమయంలో మసీదులో తాలిబాన్ల అగ్రనేతలు వున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

అంతకుముందు సెప్టెంబర్ 30న కాబూల్‌లోని ఓ విద్యాసంస్థలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది మరణించారు. చాలా కాలంగా అణచివేతను ఎదుర్కొంటున్న ఒక మైనారిటీ సమూహం-ప్రధానంగా హజారా పరిసరాల్లోని కాజ్ విద్యా కేంద్రంలో ఈ పేలుడు జరిగింది. పేలుడు కార‌ణంగా కాజ్ హయ్యర్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఒక్క‌సారిగా బ్లాస్ట్ అయింది. ఇది విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు ముందు ప్రధానంగా వయోజన పురుషులు-మహిళలకు శిక్షణ ఇస్తుంది.

PREV
click me!

Recommended Stories

Longest Expressway Tunnel : ప్రపంచంలోనే లాంగెస్ట్ టన్నెల్ ఎక్కడో తెలుసా?
Viral News: ఉద్యోగుల ఖాతాల్లోకి కోట్ల రూపాయలు డిపాజిట్.. నువ్వు బాస్ కాదు సామీ దేవుడివి