అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్‌పై 1,200 కిలోమీటర్లు తీసుకొచ్చి 15 ఏళ్ల బాలిక జ్యోతికుమారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అభినందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాంక ట్వీట్‌పై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు
అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని సైకిల్‌పై 1,200 కిలోమీటర్లు తీసుకొచ్చి 15 ఏళ్ల బాలిక జ్యోతికుమారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ అభినందించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాంక ట్వీట్‌పై జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదరికం, నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోయిన జ్యోతి సుమారు 1,200 కిలోమీటర్లు సైకిల్ తొక్కడాన్ని థ్రిల్ కోసం చేసినట్లుగా అభివర్ణిస్తున్నారని ఒమర్ మండిపడ్డారు.
undefined
Also Read:సైకిల్ పై తండ్రిని కూర్చోబెట్టుకొని 1200 కిలోమీటర్లు.... బాలికపై ఇవాంకా ప్రశంసలు!
ప్రభుత్వం జ్యోతిని ఓడించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఏదో సాధించినట్లుగా చూడటం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు జ్యోతి సాహసాన్ని గుర్తించిన సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ లక్ష ఆర్ధిక సాయం ప్రకటించారు.
భారత సైక్లింగ్ సమాఖ్య సైతం ఈ సాహస బాలిక ట్రయల్స్ నిర్వహించడానికి ముందుకొచ్చింది. అలాగే స్థానిక విద్యాశాఖ.. ఆమె మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసింది.