
70 ఏళ్లలోపు వ్యక్తుల్లో ప్రతీ రెండు సెకన్లకు ఒక్కరు చొప్పున గుండె, క్యాన్సర్, మధుమేహం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది. ఇలా సంభవించే 10 మరణాల్లో దాదాపు తొమ్మిది మరణాలు అల్ప, మధ్య ఆదాయ దేశాలలోనే జరుగుతున్నాయని చెప్పింది.
2024 ఎన్నికలు.. కాంగ్రెస్‌తో పొత్తుకు మమతా బెనర్జీ రెడీ.. మేమంతా కలిసి పోటీ చేస్తాం: శరద్ పవార్
‘‘ మిలియన్ల మంది ప్రజలు, ముఖ్యంగా తక్కువ ఆదాయ దేశాల్లో నాన్ కమ్యూనికబుల్ వ్యాధులు (అసంక్రమిత వ్యాధులు) వాటి పర్యవసానాలను నియత్రంలేవు. అలాగే ఆ వ్యాధుల ప్రభావాన్ని ఆలస్యం చేయలేవు. అక్కడి ప్రజలు కూడా చికిత్సను పొందలేరు. దీని వల్ల ప్రతీ ఏడాది 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో ఈ అసంక్రమిత వ్యాధులతో మరణిస్తున్నారు. వీరిలో 86 శాతం మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలలో నివసిస్తున్నారు’’ అని నివేదిక పేర్కొంది.
పీఎఫ్‌ఐ, ఉగ్రవాద అనుమానిత చర్యలపై కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం
ఈ అసంక్రమిత వ్యాధుల్లో ముఖ్యమైనవి గుండెజబ్బులు (గుండెజబ్బులు, స్ట్రోక్), క్యాన్సర్, మధుమేహం, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు. ఇవే ప్రపంచంలో మూడింట మూడు వంతుల మరణాలకు కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది.
పెరుగుతున్న అసంక్రమిత వ్యాధు వెనక ఉన్న కారణాలు సామాజిక, పర్యావరణ, వాణిజ్య, జన్యుపరమైనవి అని డబ్ల్యూహెచ్ వో రిపోర్ట్ లో చెప్పింది. ఏదేమైనా ప్రతీ ఆరు మరణాలలో ఒకటి.. అంటే 9.3 మిలియన్ల కుటుంబాలు ప్రతీ సంవత్సరం క్యాన్సర్ తో మరణిస్తున్నాయి.