Lebanon: లెబనాన్‌లోని యుఎస్ ఎంబసీలో కాల్పుల కలకలం..

By Rajesh Karampoori  |  First Published Sep 21, 2023, 6:26 AM IST

Lebanon: లెబనాన్‌లోని యుఎస్ ఎంబసీ సమీపంలో బుధవారం అర్థరాత్రి  కాల్పులు జరిగాయని, అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని రాయబార కార్యాలయ ప్రతినిధి జేక్ నెల్సన్ తెలిపారు.  


Lebanon: లెబనాన్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఈ కాల్పులకు సంబంధించి యూఎస్ ఎంబసీ అధికార ప్రతినిధి జేక్ నెల్సన్ సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన గురించి సమాచారం ఇస్తూ.. లెబనాన్‌లోని యుఎస్ ఎంబసీపై బుధవారం కాల్పులు జరిపినట్లు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10:37 గంటలకు కాల్పులు జరిగినట్లు అధికార ప్రతినిధి జేక్ నెల్సన్ తెలిపారు.
 
యుఎస్ ఎంబసీ ప్రవేశ ద్వారం దగ్గర కాల్పులు జరిగినట్లు ఎంబసీ అధికార ప్రతినిధి తెలిపారు. కాల్పుల శబ్ధం వినడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అమెరికా రాయబార కార్యాలయం లెబనీస్ అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రస్తుతం ఎంబసీ బయట కాల్పుల ఘటన ఎవరు చేశారు? దీని గురించి ఇంకా ఏమీ తెలియలేదు.

click me!