నా ప్రైవేట్ జెట్ ట్రాక్ చేయకండ్ర బాబోయ్.. ఓ టీనేజర్‌కు రూ. 3.75 లక్షలు ఇవ్వడానికి ఎలన్ మస్క్ డీల్

By Mahesh KFirst Published Jan 29, 2022, 6:37 PM IST
Highlights

టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌ను ఓ టీనేజర్ ట్రాక్ చేశాడు. ఆ ఫ్లైట్ టేకాఫ్, ల్యాండ్ అయిన ప్రతిసారీ వాటి వివరాలను ట్విట్టర్‌లో అప్‌డేట్ చేస్తున్నాడు. ఆయనతోపాటు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్ వంటి మరికొందరి ప్రముఖల వ్యక్తిగత వివరాలను ఇలా ట్రాక్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎలన్ మస్క్.. తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయవద్దని ఆ టీనేజర్‌తో ఓ డీల్‌కు వచ్చాడు. రూ. 3.75 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. కానీ, తనకు రూ. 37.5 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు.
 

న్యూఢిల్లీ: బడా వ్యాపారులు, దిగ్గజాలు, ప్రముఖులు తమ గోప్యత విషయంలో రాజీ పడరు. తమ రంగంలో తాము ఎంత ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత కదలికలను బహిరంగం చేసుకోరు. అందుకు ఇష్టపడరు. భద్రతా విషయంలో లేదా వ్యాపార కార్యకలాపాలు లేదా స్వతహాగా అందుకు ఇష్టపడకపోవడం వంటి అనేక కారణాలు ఇందుక దోహదం చేస్తూ ఉండవచ్చు. ఇక వరల్డ్ ఫేమస్ వ్యక్తుల గురించి చెప్పనక్కర్లేదు. ఇదే విషయాన్ని కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. స్పేస్ ఎక్స్ (Space X)ఫౌండర్, టెస్లా(Tesla) సీఈవో ఎలన్ మస్క్‌(Elon Musk)కు బిజినెస్ వర్గాల్లోనే కాదు.. బహిరంగ సమాజంలోనూ మంచి పాలోయింగ్ ఉన్నది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎలన్ మస్క్‌కు భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ విషయాన్నే క్యాష్ చేసుకోవాలనుకున్న టీనేజ్ వయసులోని ఓ కాలేజీ స్టూడెంట్ ఏకంగా ఎలన్ మస్క్ ప్రైవేటు జెట్‌(Private Jet)ను ట్రాక్(Track) చేయడం మొదలుపెట్టాడు. అందుకు ప్రత్యేకంగా ఒక బాట్‌ను కేటాయించాడు.

ఎలన్ మస్క్ ప్రైవేటు జెట్ ఎప్పుడు టేకాఫ్ అయినా.. వెంటనే దాని వివరాలను ట్రాక్ చేస్తూ ఆ బాట్ ట్విట్టర్ అకౌంట్‌లో అప్‌డేట్ చేస్తుంది. ఇలా ఇతర బడా వ్యాపార దిగ్గజాల వివరాలూ ట్విట్టర్‌లో ట్రాక్ చేస్తున్నారు. అయితే, ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేస్తున్న ట్విట్టర్ హ్యాండిల్‌కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎలన్ మస్క్ తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేస్తున్న టీనేజర్‌ను అప్రోచ్ అయ్యారు. ఆ ట్విట్టర్ హ్యాండిల్‌కు సెక్యూరిటీ రీజన్స్ ఉండటంతో కాంటాక్ట్ కాలేదు. అయితే, డైరెక్ట్ మెసేజ్ చేశారు. ఓ పిచ్చివాడు తన వ్యక్తిగత జీవితాన్ని ట్రాక్ చేయడం సరికాదని ఆయన భావించినట్టు తెలిసింది. అందుకే ఆ టీనేజర్‌కు ఓ ఆఫర్ ఇచ్చారు. 5000 అమెరికన్ డాలర్లు (రూ. 3.75 లక్షలు) ఇస్తానని చెప్పారు. తన ప్రైవేట్ జెట్‌ను ట్రాక్ చేయడం ఆపేయాలని ఆదేశించారు.

ఇందులో మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఆ టీనేజర్ ఎలన్ మస్క్ ఆఫర్‌ను తిరస్కరించాడు. తనకు 5000 డాలర్లు కాదు.. 50,000 డాలర్లు ఇవ్వాలని కోరాడు. తద్వారా తన కాలేజీ ఫీజులు అన్నీ చెల్లించవచ్చునని, ఒక టెస్లా కారునూ కొనుక్కోవచ్చని అన్నాడు. అయితే, ఆ అమౌంట్‌ను కూడా ఎలన్ మస్క్ చెల్లించడానికి అంగీకరించినట్టు తెలిసింది. కానీ, ఇంకా చెల్లించలేదని సమాచారం. తనను ఎలన్ మస్క్ ట్రాక్ చేసినా.. వెంటాడినా ఏం అభ్యంతరం లేదని ఆ టీనేజర్ పేర్కొన్నడం గమనార్హం.

ఎలన్ మస్క్‌తోపాటు బిల్ గేట్స్, జెఫ్ బెజోస్‌ల ప్రైవేట్ జెట్లనూ ట్రాక్ ఆ టీనేజర్ ట్రాక్ చేస్తున్నాడు. కానీ, ఎలన్ మస్క్ ప్రైవేట్ జెట్ ట్రాకింగ్ కోసం ప్రత్యేకంగా ఒక ట్విట్టర్ అకౌంట్ ఎలన్‌జెట్ పేరుతో ట్రాక్ చేస్తున్నాడు. ఈ అకౌంట్‌కు కనీసం 83వేల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఆ టీనేజర్ మరో కోణంలో తన సంతృప్తిని వెల్లడించాడు. ఎలన్‌జెట్, ఇతర అకౌంట్ల ద్వారా తాను ఎంతో లబ్ది పొందానని చెప్పాడు. ఈ అకౌంట్ల ద్వారా తాను భారీ సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నాడని పేర్కొన్నాడు. అంతేకాదు, ఆయన కోడింగ్‌ను నేర్చుకున్నాడని వివరించాడు. ఉబర్ జెట్స్ కంపెనీలో అప్లికేషన్ డెవలపర్‌గా ఓ పార్ట్ టైం ఉద్యోగం సంపాదించుకున్నాడని తెలిపాడు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా తాను అభిమానిస్తున్న వ్యక్తితో నేరుగా మాట్లాడగలిగానని పేర్కొన్నాడు.

click me!