అనారోగ్యంతో బ్రిటన్ ప్రిన్స్ ఫిలిప్ మృతి

By narsimha lodeFirst Published Apr 9, 2021, 4:52 PM IST
Highlights

 బ్రిటన్ రాణి ఎలిజబెత్-2  భర్త ఫిలిప్  శుక్రవారం నాడు కన్నుమూశారు.ఆయన వయస్సు 99 ఏళ్లు.
 

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2  భర్త ఫిలిప్  శుక్రవారం నాడు కన్నుమూశారు.ఆయన వయస్సు 99 ఏళ్లు.ఇటీవల కాలంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో కోలుకొన్న తర్వాత ఆయన ప్యాలెస్ కు తిరిగి చేరుకొన్నారు. ప్యాలెస్ కు చేరుకొన్న తర్వాత ఆయన తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. 

ప్రిన్స్ ఫిలిప్ 1921 జూన్ 10న జన్మించారు. ప్రిన్స్  ఫిలిప్, రాణి దంపతులకు నలుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవరాళ్లు. 10 మంది మునిమనవళ్లున్నారు.ప్రిన్స్ ఫిలిప్ మరణించినట్టుగా బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం నాడు ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలోని సుదీర్ఘకాలం పాలించిన చక్రవర్తితో పాటు రాజ కుటుంబంలో కష్టపడి పనిచేసే సభ్యుల్లో ఒకరిగా ఫిలిప్ పేరు పొందారు.

1947లో అప్పటి యువరాణి ఎలిజబెత్ ను ఆయన వివాహం చేసుకొన్నాడు.ఫిలిప్ రాణి ఎలిజబెత్ కు మద్దతుగా 65 ఏళ్లపాటు పనిచేశాడు. 2017లో ఆచయన తన ఆయన ఈ విధుల నుండి తప్పుకొన్నారు. యువరాణి కింద రాచరికం కోసం ఆయన ఒక కొత్త కోర్సును ఏర్పాటు చేయడంలో సహాయపడ్డాడు. 

click me!