ఈజిప్ట్ జట్టు ఓటమి తట్టుకోలేక కామెంటేటర్ మృతి

First Published Jun 26, 2018, 4:04 PM IST
Highlights

ఉత్కంట తట్టుకోలేక ఒత్తిడితో హార్ట్ ఎటాక్...

ఫిఫా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ ఉత్కంటభరితంగా కొనసాగుతోంది. దీంతో పుట్ బాల్ ప్రియులు నరాలు తెగే ఉత్కంట మద్య మ్యాచ్ లు చూస్తుంటారు. అయితే ఇలాంటి ఉత్కంట పోరులో తమ జట్టు పరాజయం పాలవడంతో బావోద్వేగానికి లోనైన ఓ టీవీ కామెంటేటర్ గుండె పోటుతో మృతిచెందాడు. సౌదీ అరెబియా చేతిలో ఈజిప్ట్ ఓడిపోగానే అబ్దుల్ రహీమ్ అనే కామెంటేటర్ గుండె పోటుతో మృతి చెందినట్లు స్థానిక మీడియా తెలిపింది. 

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా గ్రూప్ ఎ నుండి సౌదీ అరెబియా, ఆజిప్ట్ జట్లు నిన్న తలపడిన విషయం తెలిసిందే.  అయితే ఈ మ్యాచ్ లో తొలుత కెప్టెన్ సలా గోల్ చేసి ఈజిప్ట్ ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే సౌదీ మిడ్‌ఫీల్డర్‌ అల్‌ ఫరాజ్‌ గోల్‌ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. అయితే చివరివరకు ఇలా సమాన ఆటతీరుతో మ్యాచ్ ఉత్కంటగా సాగింది. అయితే చివరి క్షణాల్లో సౌదీ ఆటగాడు సలీమ్‌ అల్‌దౌసరీ గోల్‌ చేయడంతో 2-1 తేడాతో ఆ జట్టు విజయం
సాధించింది.

ఈ మ్యాచ్  తర్వాత అబ్దుల్ ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో విశ్లేషణ అందించాల్సి ఉంది. అయితే అక్కడ ఉండగానే అతడికి చాతీలో నొప్పి వచ్చింది. దీంతో హుటాహుటిన దగ్గర్లోని ఆస్పత్రికి తరలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. అతడు ఆస్పత్రికి చేరేలోపే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తీవ్ర ఒత్తిడి వల్ల గుండె పోటు రావడం వల్లే అబ్దుల్ చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.   


 
 

click me!