ఇండోనేషియాలో మరోసారి భూకంపం..  భయంతో ప్రజలు పరుగులు..

By Rajesh KarampooriFirst Published Jan 24, 2023, 5:36 AM IST
Highlights

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం నాడు భూమి  కంపించింది.

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు వాయువ్యంగా 162 కిలోమీటర్ల దూరంలో సోమవారం నాడు భూమి  కంపించింది. భయంతో ప్రజలు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) వెల్లడించింది. భూకంపం 23:47:34 (UTC+05:30)కి సంభవించింది . భూకంప కేంద్రం వరుసగా 2.881 అక్షాంశం , 127.100 రేఖాంశంలో భూకంపం సంభవించింది. USGS ప్రకారం.. సముద్ర మట్టానికి 12 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. టోబెలో అనేది తూర్పు ఇండోనేషియా ద్వీపం హల్మహెరాలో ఉన్న ఒక నగరం మరియు జిల్లా.

అంతకుముందు.. జనవరి 16 తెల్లవారుజామున ఇండోనేషియా తీరంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూఅంతర్భాగంలో 151 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు వచ్చాయని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇండోనేషియాలోని సింగ్‌కిల్ నగరానికి ఆగ్నేయంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. సముద్ర మట్టానికి 37 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది.  
 
అంతకు ముందు.. గత శనివారం మధ్యాహ్నం ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్‌లోని అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనతో సమీపంలోని గ్రామాలు, నగరాల్లోని నివాసితులను అధికారులు ఖాళీ చేయించారు.  ప్రావిన్స్‌లోని లుమాజాంగ్ రీజెన్సీలోని సెమెరు పర్వతం వద్ద శనివారం మధ్యాహ్నం 3:20 గంటలకు విస్ఫోటనం సంభవించిందని సెంటర్ ఫర్ వాల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ తెలిపింది

ఇదిలా ఉంటే.. ఉత్తరాఖండ్ లో భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం పితోరగఢ్ లో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. సముద్రమట్టానికి 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు వెల్లడించింది. పితోరగఢ్ కు భూకంప కేంద్రం ఉత్తర వాయువ్యంగా 23 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టు పేర్కొంది. ఆదివారం ఉదయం కూడా ఉత్తరాఖండ్ లోని ఫితోరగఢ్ లో భూమి కంపించిందని నేషనల్ సెంట్ ఫర్ సిస్మాలజీ ట్వీట్ చేసింది.  

click me!